తెలంగాణ

అఖిలపక్ష పర్యటన వాయదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 4: ముఖ్యమంత్రి నేతృత్వంలోని అఖిలపక్ష బృందానికి ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ను ప్రధాన మంత్రి కార్యాలయం రద్దు చేసింది. 6న అఖిలపక్ష బృందం కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. దీన్ని రద్దు చేసినట్టు, మరోసారి అపాయింట్‌మెంట్ ఇస్తామని ప్రధానమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి కార్యాలయానికి శనివారం రాత్రి సమాచారం అందించింది. ఆదివారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సన్నద్ధమయ్యారు. అధికారులతో సమావేశం జరిపి కేంద్రంతో చర్చించాల్సిన అంశాల జాబితాను సైతం రూపొందించుకున్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా, శనివారం రాత్రి అపాయింట్‌మెంట్ రద్దయినట్టు పిఎంవో నుంచి వర్తమానం అందింది. దీంతో ముఖ్యమంత్రి కెసిఆర్ తన మూడు రోజుల ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. త్వరలోనే పిఎంఓ తిరిగి అపాయింట్‌మెంట్ తేదీ వెల్లడిస్తామని చెప్పినందున, అపాయింట్‌మెంట్ ఇవ్వగానే ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లనున్నట్టు సిఎంవో ప్రకటించింది.