తెలంగాణ

ప్రాజెక్టులకు అడ్డు.. పాపిష్టి కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 5: పాపిష్ఠి కాంగ్రెస్ నాయకులు తెలంగాణలోని ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే తమకు పుట్టగతులు ఉండవని ఉక్కిరిబిక్కిరి అవుతూ గిలగిలా కొట్టుకుంటూ కోర్టుల్లో కేసులు వేస్తూ తెలంగాణ రైతాంగం పొట్టగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని, ఇలాంటి వారికి తగిన బుద్ధి చెబుతామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం, మామిడిమాడ గ్రామాలలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఘనపురం బ్రాంచ్ కెనాల్ కాల్వల తవ్వకం పనుల పైలాన్‌ను మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, ఎంపి జితేందర్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. అదేవిధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్-3 గుడిపల్లి గట్టు రిజర్వాయర్ నుండి మామిడిమాడ చెరువుకు కృష్ణాజలాలు రావడంతో కృష్ణాజలాలకు మంత్రి హరీశ్ రావు పూజలు నిర్వహించారు. పలు చెరువులకు వెళ్తున్న కృష్ణా జలాల కాల్వలను పరిశీలించారు. మిషన్ కాకతీయ మూడవ విడత పనులను గణపతి సముద్రం చెరువు దగ్గర పనులు ప్రారంభించారు. అనంతరం ఖిల్లాఘనపురంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కృష్ణా జలాలు కాల్వల వెంట పరవళ్లు తొక్కుతుంటే ఎంతో ఆనందంగా ఉందని, ఈ సీజన్‌లో ఉమ్మడి పాలమూరు జిల్లా చరిత్రలోనే చెరువులు నిండుకుండలా మారిన ఘనత కేవ లం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనేనని అన్నారు. పచ్చని పంటలు చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఎత్తుకు పై ఎత్తు వేస్తూ పాపిష్ఠులుగా మారారని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికే వారు పదేళ్ల పాలనలో చేసిన పాపాలను తెలంగాణ ప్రభుత్వం సవరిస్తోందని, కల్వకుర్తి ప్రాజెక్టు డిజైన్ చేసిన కాంగ్రెస్ నాయకులు పనులు ప్రారంభించి కేవలం పంపులు, పైపులు, మోటార్లు పెట్టి కమీషన్లు మాత్రం తిన్నారని ఆరోపించారు. వారి పదేళ్ల హయాంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా కేవలం 13 వేల ఎకరాలకు సాగునీరు అందించి అసంపూర్తిగా పనులు చేసి వదిలిపెట్టారని హరిశ్‌రావు ఘాటైన విమర్శలు గుప్పించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల పాలనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు దాదాపు రూ.600 కోట్లు ఖర్చు చేసి దాదాపు నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీటి అందించిన ఘనత సాధించిందని అన్నారు. మరో రూ.1000 కోట్లు ఖర్చు చేసి ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి మరో నాలుగు లక్షల ఎకరాలను కృష్ణా జలాలను అందిస్తామని వెల్లడించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుండే వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గాలో మరో 25 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికే ఘనపురం బ్రాంచ్ కెనాల్ పైలాన్ ప్రారంభించామని, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు.