తెలంగాణ

ఖాళీ స్థలాల గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: రాజధాని నగరంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి నిధుల కొరత లేదని, ఖాళీ స్థలాల కోసం అనే్వషిస్తున్నట్టు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించిన తరువాత రెవెన్యూ, మున్సిపల్, జిహెచ్‌ఎంసి అధికారులతో కెటిఆర్ సోమవారం సమావేశం అయ్యారు. ఇంకా టెండర్లు పిలవని ప్రాంతాల్లో టెండర్లను పిలవాలని చెప్పారు.
వివిధ ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న ఖాళీ స్థలాలను గుర్తింపును వేగవంతం చేసి, ఇళ్ల నిర్మాణానికి అనువుగా ఉండే ప్రాంతాలతో సమగ్ర నివేదిక తయారు చేయాలని కెటిఆర్ అధికారులకు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన స్థలాలు ఉంటే, ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాలని కోరాలని నిర్ణయించారు. మురికివాడ ప్రజలను ఒప్పించి వారిలో చేతన్యం తీసుకురావాలని, ప్రస్తుతం ఉన్న స్థలాల్లో డబుల్ బెడ్‌రూమ్‌లు నిర్మించాలని అన్నారు. మురికి వాడల వాసులను ఒప్పించేందుకు ఎన్‌జివోల సేవలు ఉపయోగించుకోవాలని చెప్పారు. కాంట్రాక్టర్లకు కూడా ఈ అంశాన్ని వివరించి పనులు చేయడానికి ఒప్పించాలని అన్నారు.
భారీ హౌజింగ్ ప్రాజెక్టులు చేపట్టే కంపెనీలతో ప్రత్యేకంగా మాట్లాడి ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా అయ్యేలా చూడాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్‌కు చెప్పారు. హైదరాబాద్ డబుల్ బెడ్‌రూమ్ నిర్మాణాన్ని వేగవంతం చేస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలపై సానుకూల ప్రభావం ఉంటుందని అన్నారు. ఎక్కడైతే ఇళ్ల నిర్మాణానికి స్థలాలు గుర్తించారో అక్కడి ప్రజాప్రతినిధులతో తానే సమావేశం అయి ఈ కార్యక్రమానికి మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.