తెలంగాణ

ఫేస్‌బుక్‌ను ఉపయోగించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: హైదరాబాద్‌లో బాంబులు అమర్చి విధ్వంసానికి పాల్పడాలని కుట్రపన్నిన 8మంది ఐఎస్‌ఐఎస్ సానుభూతిపరులు ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాద్యమాలను ఉపయోగించరాదని, దీనివల్ల పోలీసులకు దొరికిపోయే అవకాశాలు ఉన్నాయని ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ తన సానుభూతిపరులను ఆదేశించింది. వీరిపైన కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటులో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ (ఎన్‌ఐఏ) ఈ వివరాలను పేర్కొంది.
ఐసిస్ సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెదకవద్దని అరెస్టయిన వారిలో ఒకరైన ఎలక్ట్రికల్ ఇంజనీర్ మహమ్మద్ ఇబ్రహీం యజ్దానీని ఉగ్రసంస్థ హ్యాండ్లర్ చెప్పినట్లు ఎన్‌ఏఏ దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసుపై ఎన్‌ఏఏ ఇటీవల దాఖలు చేసిన చార్జిషీటులో ఐఎస్‌ఐఎస్ హ్యాండ్లర్ తన అనుచరులకు ఇచ్చిన ఆదేశాలపై ఆసక్తికరమైన సమాచారం ఉంది. మెసేజింగ్ యాప్, చాట్ సెక్యూర్‌ను గ్రూప్ కమ్యూనికేషన్ కోసం వినియోగించాలని ఐఎస్‌ఐఎస్ ఆదేశించింది. అలాగే సానుభూతిపరుల గ్రూప్ వీలైనంత చిన్నదిగా బృందాలుగా ఉండాలని కోరారు.
బృందంలోని సభ్యులు ఎక్కడ కలుసుకోవాలో తెలియచేసేందుకు మాత్రమే మొబైల్ ఫోన్‌ను వినియోగించాలని వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాత్రమే సమాచారాన్ని పంచుకోవాలన్నారు. ఎన్‌ఐఏ ఈ 8మంది సానుభూతిపరులను విచారించింది. కమ్యూనికేషన్ నిమిత్తం డార్క్ నెట్ లేదా కోడ్ భాషను ఉపయోగించేవారు. ఇందుకు సంబంధించి యజ్దానీకి టెలిగ్రాం ఐడి అందింది. ఈ ఐడిని సానుభూతిపరులకు ఇచ్చి, దీని ద్వారా సమాచారాన్ని పంచుకోవాలని ఐఎస్‌ఐఎస్ ఆదేశించినట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది.