తెలంగాణ

హక్కుల కోసం ‘సేవాస్తంభ్’ పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: బడుగు, బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం ‘సేవాస్తంభ్’ (ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ ఎంప్లాయిస్ ఫెడరేషన్) గత ఐదు దశాబ్దాల నుండి పోరాటం చేస్తోందని తెలంగాణ ప్రెస్‌క్లబ్ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. సేవాస్తంబ్ రూపొందించిన 2017 డెస్క్ క్యాలండర్‌ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. సేవాస్తంభ్‌ను మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రారంభించారని గుర్తు చేశారు. జనాభాలో అధికభాగంగా ఉన్న బిసి, ఎస్‌సి, ఎస్‌టి వర్గాలు చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం సేవాస్తంభ్ పనిచేయడం పట్ల అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్గాల కోసం సేవాస్తంభ్ పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవాస్తంభ్ అధ్యక్షుడు డాక్టర్ బి. శేఖరరావు, ప్రధాన కార్యదర్శి పి. దేవరాజు తదితరులు పాల్గొన్నారు.