తెలంగాణ

4లక్షల కుటుంబాలకు గొర్రెల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండువేల కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో నాలుగు లక్షల కుటుంబాలకు 75శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేయనుంది. దీని కోసం ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందిస్తోంది. పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం సచివాలయంలో గొర్రెలు, మేకల పెంపకం దారుల సహకార సంఘం ప్రతినిధుల రాష్ట్ర స్థాయి సదస్సులో ఈ విషయం తెలిపారు. ప్రతి కుటుంబానికి 20 చొప్పున మొత్తం 80 లక్షల గొర్రె పిల్లలను పంపిణీ చేసేందుకు పాడి పరిశ్రమ శాఖ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తోందని చెప్పారు.
ప్రతి సంవత్సరం యాదవ సోదరులు నారాయణగూడలో ఘనంగా నిర్వహించే సదర్ ఉత్సవాలను వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో రెండు వేర్వేరు వర్గాలుగా ఉన్న కుర్మ, యాదవ సోదరులను ఏకం చేస్తూ పది లక్షల మందితో నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తలసాని తెలిపారు. ఈ సభకన్నా ముందు ఆయా జిల్లాల్లో కుర్మ, యాదవ సోదరులను ఏకం చేస్తూ జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈనెల 12న మాజీ ఎమ్మెల్సీ అరికెల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆసిఫాబాద్‌లో యాదవ శంఖారావం నిర్వహించనున్నట్టు చెప్పారు.
గొర్రెల పెంపకందారులకు ప్రస్తుతం లక్ష ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నామని, దీనిని ఆరు లక్షలకు పెంచుతున్నట్టు చెప్పారు. గతంలో గొర్రెల పంపిణీలో 25శాతం సబ్సిడీని మాత్రమే ప్రభుత్వం భరించేదని, ఇప్పుడు 75శాతం సబ్సిడీ భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం వల్ల కేంద్రం ఎన్‌సిడిఇ కింద 400 కోట్ల రూపాయల రుణం ఇచ్చినట్టు చెప్పారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 100 సంచార పశు వైద్య శాలలు మే మొదటి వారంలో ప్రారంభించనున్నట్టు తలసాని తెలిపారు.
గొర్రెల పెంపకం కోసం ఎన్‌సిడిపిసి కింద కేంద్రం ఇచ్చిన నాలుగు వందల కోట్ల రూపాయలు సరిపోవని, కనీసం మూడువేల కోట్ల రూపాయలు మంజూరయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని మంత్రి తెలిపారు.