తెలంగాణ

ఢిల్లీకి సచివుల క్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మార్పులతో రాష్ట్రానికి సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు సాధించేందుకు తెలంగాణ మంత్రులు తమ శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో బడ్జెట్‌లో రాష్ట్రాలకు ప్రత్యేకంగా ప్రాజెక్టులు కేటాయించే వారు. అయితే ఈసారి బడ్జెట్‌లో రాష్ట్రాల ప్రస్తావనే తీసుకు రాలేదు. ఆయా శాఖలకు నిధులు కేటాయించారు. దీంతో పనితీరు మెరుగుపరుచుకోవడం, నిధుల వ్యయంపై ఎప్పటికప్పుడు కేంద్రానికి యుటిలైజేషన్ సర్ట్ఫికెట్‌లు పంపడం ద్వారా ఎక్కువ నిధులు పొందేందుకు మంత్రులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర బడ్జెట్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, తమ తమ శాఖలకు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు ఏ విధంగా పొందవచ్చు అనే అంశంపై దృష్టిసారించాలని సూచించారు. దాంతో మంత్రులు వరుసగా సమీక్షలు నిర్వహించి నిధులు పొందే ప్రణాళికలపై దృష్టిసారించారు. గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్రంలో గృహ నిర్మాణంపై నివేదిక రూపొందించాలని ఇప్పటికే అధికారులకు సూచించారు. కేంద్రం ఈసారి గృహ నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నందున రాష్ట్రం వాటా పొందేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. నివేదికలను రూపొందించిన తరువాత మంత్రులు వరుసగా ఢిల్లీ పర్యటన చేయనున్నారు.
రవాణాశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రతిపాదనలతో ఈనెల 8న ఢిల్లీ వెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. 167కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించారు. గడిచిన సంవత్సరంలో తమ శాఖకు కేంద్రం నుంచి 13వేల కోట్లు అందినట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈసారి తెలంగాణలోని జాతీయ రహదారులకు అధిక నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. జాతీయ రహదారుల అభివృద్ధి, నూతన జాతీయ రహదారుల నిర్మాణం, రహదారి భద్రతా ఇంజనీరింగ్ పనులు, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పథకం కింద రోడ్ల నిర్మాణం, సిఆర్‌ఎఫ్ నిధులు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి నిధులను కేంద్రం నుంచి సాధ్యమైనంత ఎక్కువగా సాధించేందుకు నివేదికలు రూపొందించారు. అలాగే గతంలో మంజూరైన నిధుల విషయంలో యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు ఎప్పటికప్పుడు పంపడం ద్వారా ఎక్కువ నిధులు పొందేందుకు అవకాశం ఉంటుందని తుమ్మల తెలిపారు.
పంచాయతీరాజ్ శాఖకు ఎక్కువ నిధులు: జూపల్లి
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్రం నుంచి ఎక్కువ నిధులు సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌లో జరిగిన కేటాయింపులకు అనుగుణంగా కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని మంత్రి జూపల్లి తన శాఖ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరచాలని చెప్పారు. ఉపాధి హామీ ఆన్‌లైన్ సర్వర్‌ను వారంలో అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాల్లో ఉపాధి హామీ కింద టాయిలెట్లను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. తక్షణమే అన్ని జిల్లాలనుండి సిసి రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో పాటు పనులు ప్రారంభించాలని సూచించారు.