తెలంగాణ

మరో 2 వేల మంది డాక్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఫిబ్రవరి 7 : రాష్ట్రంలో ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రెండు వేలమంది వైద్యులను త్వరలో భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ఆరో గ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్ వాకాటి కరుణ వెల్లడించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన అనంతరం విలేఖరులతో ఆమె మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటలు (రౌండ్ దీ క్లాక్) పనిచేనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరిపడు వైద్యులు లేకపోవడం వల్ల ప్రజలకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలో కొత్తగా డయాలసిస్ సెంటర్లలో టెండరు ప్రక్రియ పూర్తయినా సర్వీస్ ప్రొవైడర్లు లేకపోవడం వల్ల జాప్యం జరిగిందన్నారు. నెలలోపు కొత్తగా డయాలసిస్ సెంటర్లల్లో సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. సిద్దిపేట ఏరియా ఆసుపత్రి ఐసిసి యూనిట్‌లో రెగ్యులర్ స్ట్ఫాను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెసి హన్మంత్‌రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ నరసింహాం, డిఎంహెచ్‌ఓ రామకృష్ణ, వైద్యులు శివరాం, మహేశ్, డిపిఓ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.