తెలంగాణ

ప్రాణం తీసిన రూ. 10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 7: అక్క, చెల్లెళ్ల్ల మధ్య గొడవ ప్రాణం మీదకు తెచ్చింది. తాను దాచుకున్న సొమ్మును, చెల్లి, తమ్ముడు తరుచూ తీసుకుంటున్నారని గొడవపడిన అక్క రూ.10 కోసం తీవ్ర మనస్తాపం చెంది వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం అంతర్గాం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. అంతర్గాం గ్రామంలోని ఒడ్డెర కాలనీకి చెందిన గండికోట లక్ష్మి-హన్మంతు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అందులో మొదటి కూతురు నాగలక్ష్మి కుటుంబ సభ్యులు ఇచ్చిన రూ.50 నోటును ఇంట్లోనే దాచుకుంది. దీనిని గమనించిన రెండవ కూతురు అక్షయ తన అక్క దాచుకున్న రూ.50 నోటును తీసుకొని అందులోంచి రూ. 10 ఖర్చు చేసంది. ఇది గమనించిన నాగలక్ష్మి తాను దాచుకున్న రూ.50లో నుండి చెల్లి రూ. 10 ఖర్చు చేసిందని ఆమెతో గొడవ పడడమే కాకుండా తీవ్ర మనస్తాపం చెంది నాగలక్ష్మి (17) సమీపంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా శవాన్ని పోస్టుమార్టం నిర్వహించి, తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జగిత్యాల రూరల్ ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు.