తెలంగాణ

అది చట్టవిరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: చట్టంలో కారుణ్య కారణాలపై వారసత్వ ఉద్యోగ నియామక విధానం ఎక్కడాలేదని హైకోర్టు స్పష్టం చేసింది. సింగరేణి కాలరీస్ సంస్థలో 30 వేల ఉద్యోగాలను వారసత్వ కారుణ్య నియామకాలతో భర్తీ చేస్తామని సింగరేణి జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ గోదావరిఖనికి చెందిన కె సతీశ్‌కుమార్ దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. హైకోర్టు ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని తెలియచేయాలని కేంద్రం, సింగరేణి, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును మార్చి 6వ తేదీకి వాయిదా వేస్తూ ఆలోగా నోటీసులపై అఫిడవిట్లను ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పిల్‌ను జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్, జస్టిస్ జె ఉమాదేవితో కూడిన ధర్మాసనం విచారించింది. సింగరేణి డిసెంబర్ 16వ తేదీన వారసత్వ కారుణ్య నియామకాలపై సర్క్యులర్‌ను జారీ చేసిందని పిల్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 14,16 అధికరణాల ప్రకారం పౌరులకు సమాన అవకాశాలు కల్పించాలని పిటిషనర్ తరపున న్యాయవాది ఎస్ సత్యంరెడ్డి అభ్యర్థించారు. సింగరేణి విధానం వల్ల నిరుద్యోగులు అవకాశాలు కోల్పోతారని, వారసత్వ ఉద్యోగ నియామకాన్ని చట్టం అనుమతించదన్నారు. అయితే ఉద్యోగం చేస్తూ మరణించిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకునేందుకు, లేదా విధి నిర్వహణకు వైద్యపరంగా ఫిట్ కారనే కారణంపై మాత్రమే వారి పిల్లలకు వారసత్వ కారుణ్య నియామకం వర్తిస్తుందని హైకోర్టు పేర్కొంది. వేరే కారణాలపై వారసత్వ ఉద్యోగ నియామకాలను అనుమతిస్తే ప్రతి ఒక్కరు తమ పిల్లలకు ఉద్యోగం అడుగుతారని హైకోర్టు పేర్కొంది. ఏజి రామకృష్ణా రెడ్డి వాదనలు వినిపిస్తూ, వేరే ఉద్యోగాలతో సింగరేణి ఉద్యోగాలను పోల్చడానికి వీలు లేదన్నారు. 48 నుంచి 58 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న వారు వైద్యకారణాలపై స్వచ్ఛంద పదవీవిరమణ కోరితే, వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇస్తారన్నారు. ఈ ఉద్యోగాలు చేసే వారు సింగరేణి బావుల్లో చేసే వారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.