తెలంగాణ

బాబానని నమ్మించే అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: బాబానని, స్వామీజీనంటూ అమాయకులను బుట్టలో వేసుకుని మోసాలు చేసే ఓ బురిడీ బాబాను పంజాగుట్ట పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. భక్తి ముసుగులో ఆంధ్రా, తెలంగాణల్లో యధేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్న తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటకు చెందిన నేదూరి శ్రీను అలియాస్ సిద్ధిరెడ్డి సత్యనారాయణ (39)ని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ నగర పశ్చిమ మండలం డిసిపి తెలిపారు. పలు ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడ హోటళ్లు, లాడ్జిల్లో బస చేసి తాను బాబానని ప్రచారం చేసుకుంటూ అమాయకులను మోసం చేయడం ప్రారంభించాడు. 2013లో దొంగతనం, మోసం చేసిన కేసులో పత్తిపాడు పోలీసులు అరెస్టు చేశారు. తనకు చెన్నైలో ఆశ్రమం ఉందని, కొందరు బంగారం అమ్మేవాళ్లు తెలుసునని, తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని చెప్పి మోసగించేవాడు. మరికొందరికి తాను బాబాగా ప్రచారం చేసుకుని తీర్థంలో మత్తు మందు కలిపి మోసం చేసి వారి ఆభరణాలు ఎత్తుకెళ్లే వాడని డిసిపి తెలిపారు.