తెలంగాణ

‘గాంధీ’లో మరో స్వైన్‌ఫ్లూ మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: నగరంలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలను తోడేస్తుంది. ఈ సంవత్సరం జనవరి నుంచి నేటివరకు ఒక్క గాంధీ ఆసుపత్రిలోనే పదిమంది వరకు మృత్యువాత పడ్డారు. ఇసిఐఎల్‌కు చెందిన దయాళ్ (69) ఈనెల 13న స్వైన్‌ఫ్లూతో ఆసుపత్రిలో చేరాడు. రోగి రక్తనమూనాలను వైద్య పరీక్షల నిమిత్తం పంపించి చికిత్స అందిస్తున్న తరుణంలోనే అదేరోజు దయాళ్ మృతి చెందాడు. బుధవారం వచ్చిన రక్తపరీక్షల నివేదికలో ఆయనకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్థారణ అయింది. ఇంకా గాంధీ ఆసుపత్రిలో 12మంది వరకు ఈవ్యాధితో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఆరుగురు చిన్నారులు, ఆరుగురు పెద్దలు ఉన్నారు. వీరిలో ఓ గర్భిణీ కూడా ఉంది. ఉప్పల్‌కు చెందిన ఆ గర్భిణీకి స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకి చికిత్స పొందుతున్న తరుణంలో పురిటినొప్పులు రావడంతో ఆమెను గాంధీకి తరలించారు. గాంధీలో ప్రత్యేకంగా ఆమెకు నిపుణులైన వైద్యబృందం శస్తచ్రికిత్స చేశారు. పుట్టిన శిశువుకు కూడా స్వైన్‌ఫ్లూ వచ్చే అవకాశం ఉండడంతో ఐసియులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా గాంధీ సూపరింటెండెంట్ జెవిరెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు గాంధీ ఆసుపత్రికి ఇతర ఆసుపత్రుల నుంచి రెఫరల్‌గా వచ్చిన వారే అధికంగా మృత్యువాత పడ్డారని అన్నారు. స్వైన్‌ఫ్లూకు చికిత్స కోసం గాంధీలో అన్ని ఏర్పాట్లు చేశామని, ఔషధాలు అందుబాటులో ఉన్నాయని, నిపుణులైన వైద్యబృందం అప్రమత్తంగా ఉండడంతోపాటు నిరంతరం సేవలు అందిస్తున్నారని ఆయన వివరించారు.