తెలంగాణ

నిరుద్యోగ ర్యాలీకి ‘ఆప్’ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: తెలంగాణ జెఏసి ఈ నెల 22న తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మద్దతు ప్రకటించింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువతకు తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిక్త హస్తం చూపిస్తోందని అన్నారు. కేవలం పోలీసు విభాగాన్ని పటిష్టం చేసుకోవడం తప్ప రాష్ట్రంలో ఇతర శాఖల్లో ఇప్పటి వరకు సరైన తరహాలో నోటిఫికేషన్లు ఇవ్వలేదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగ నిరసన ర్యాలీకి తమ పార్టీకి చెందిన శాసనసభ నియోజకవర్గ, లోక్‌సభ నియోజకవర్గ కమిటీలన్నీ పూర్తి మద్దతు ఇస్తాయని తెలిపారు. నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.