తెలంగాణ

వైద్యం పడకేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ, విషజ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టిటిడిపి నేతలు గవర్నర్ నర్సింహన్‌కు ఫిర్యాదు చేశారు. నిరుపేదలకు వైద్యం అందించడంలో వైద్య ఆరోగ్య శాఖ విఫలమవుతోందని వారు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, నిమ్స్, సరోజినిదేవి వంటి పెద్దాసుపత్రుల్లో ప్రాణాలు నిలబెడతారని ఆశించి వెళితే అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగులను పాడె ఎక్కిస్తున్నారని ఆరోపించారు. టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, ఇ పెద్దిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు జి మోహన్‌రావు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య గురువారం గవర్నర్‌ను కలిశారు. నిలోఫర్ ఆసుపత్రిలో వారం రోజుల వ్యవధిలో సిజేరియన్ శస్తచ్రికిత్స వికటించి ముగ్గురు బాలింతలు మృతి చెందిన సంఘటనలో సూపరింటెండెంట్, ఆర్‌ఎంవోలను బదిలీ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఇద్దరు బాలింతలు చనిపోగా, నిలోఫర్‌లో సగటున 205 మంది చిన్నపిల్లలు మృత్యువాతపడుతున్నా ప్రభుత్వం కనె్నత్తి చూడటం లేదని వారు గవర్నర్‌కు వివరించారు. 2015 నుంచి 2016 డిసెంబర్ వరకు 15,378 మంది చిన్న పిల్లలు నిలోఫర్‌లో చేరగా, వారిలో 2,411 మంది చనిపోయారని చెప్పారు. తెలంగాణలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని అన్నారు. ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం ఈ నెల 14న ఒక్క రోజే 137 నమూనాలను పరిశీలించగా వారిలో 39 మందికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్థారణ జరిగిందని వారు గుర్తు చేశారు. విషజ్వరాలతో లెక్కలేనంతమంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో చేరుతున్నారని అన్నారు. నిజామాబాద్‌లోని బోధన్ కేంద్రంగా రైస్ మిల్లర్లు నకిలీ చలాన్ల ద్వారా రాష్ట్ర ఖజానాకు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం దోచుకున్నా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని సిఎం కెసిఆర్‌ను టిటిడిపి జాతీయ పార్టీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి విమర్శించారు. ‘మీ పరిధిలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖలో భారీగా అక్రమాలు జరిగితే మీరేం చేస్తున్నార’ని ఆయన సిఎంను నిలదీశారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో దోపిడీ జరిగిందని, ఆంధ్రాపాలకుల వల్ల అక్రమాలు జరిగాయని గొంతెత్తి చాటిన కెసిఆర్ ఇప్పుడు తన వద్ద ఉన్న వాణిజ్య పన్నుల శాఖలో అక్రమాలు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గురువారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ నకిలీ చలాన్ల కారణంగా రాష్ట్ర ఖజానాకు రావాల్సిన 4 శాతం వ్యాట్, ఒక శాతం మార్కెట్ సెస్ ఎగ్గొట్టినట్లు ప్రతి రోజు పత్రికల్లో కథనాలు వస్తుంటే సరైన చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని అన్నారు.

చిత్రం..గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న టి.టిడిపి నేతలు