తెలంగాణ

దండకారణ్యం బంద్ హింసాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, నవంబర్ 25: ఆపరేషన్ గ్రీన్‌హంట్ నిలిపివేయాలని, మావోయిస్టుల వేట పేరుతోచేపట్టిన వైమానిక దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు నిర్వహించిన బంద్ హింసాత్మకంగా సాగింది. దక్షిణ బస్తర్ ప్రాంతంలోని భానుప్రతాప్‌పూర్ మైన్స్‌లో సుమారు 31 వాహనాలకు, మిషన్లకు మావోయిస్టులు నిప్పు పెట్టారు. బొలేరో వాహనాల్లో భారీ సంఖ్యలో వచ్చిన సాయుధ మావోయిస్టులు వీటికి నిప్పు పెట్టి బ్యానర్లు, కరపత్రాలు వదిలివెళ్లారు. 13 హైవాలు, రెండు లోడర్లు, ఆరు ఎక్స్‌కేవేటర్లు, ఒక డోజర్, రెండు డీజీలు, రెండు డ్రిల్లింగ్ మిషన్లు, ఒక స్కార్పియో, రెండు బొలేరోలు, ఒక మెటాడోర్, ఒక అంబులెన్స్, ఒక కంటైనర్, రెండు పవర్‌స్క్రీన్లతో సహా 31 వాహనాలు, రెండు మిషన్లు దహనమైన వాటిలో ఉన్నాయి. దీనివల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని మైన్స్ అధికారులు పేర్కొంటున్నారు. కాగా అర్ధరాత్రి సుకుమా జిల్లా దర్బా ఘాట్‌లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకరమైన పోరు జరిగింది. బంద్‌ను నిర్వీర్యం చేసేందుకు సుకుమా పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోలు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆ రహదారిలో అర్థరాత్రి వేళ వాహనాలు భారీ సంఖ్యలో బారులుతీరి నిలిచిపోయాయి. సుమారు 200 మంది ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని తుపాకీ పేలుడు శబ్దాల మధ్య బిక్కుబిక్కుమంటూ గడిపారు. దంతెవాడ జిల్లా కొకనార్ పోలీసుస్టేషన్ పరిధిలో ఐదు కిలోల మందుపాతరను వెలికితీశారు. బీజాపూర్ జిల్లాలోని బాసగూడ పోలీసుస్టేషన్ పరిధిలో చోటేసకనపల్లి గ్రామం అటవీప్రాంతంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో గుల్షన్‌కుజూర్ (కోబ్రా), భీమ్ (జిల్లా పోలీసు)లకు తీవ్ర గాయలయ్యాయి. ఇదే జిల్లాలోని భూపాలపట్నంకు ఐదు కిలోమీటర్ల దూరంలోని ఉల్లూరు అనే గ్రామంలో పాఠశాల భవన నిర్మాణానికి ఉపయోగించే మూడు మిక్చర్లను మావోయిస్టులు దగ్ధం చేశారు. దంతెవాడ జిల్లాలో డప్పాల్ - డిడం మధ్య రైల్వేలైన్లను మావోయిస్టులు తొలగించారు. గ్యాంగ్‌మెన్ నుంచి టూల్ కిట్లను ఎత్తుకెళ్లారు. ఎన్‌హెచ్-30పై ఎర్రబోరు- కుంట మధ్యలోని అసీల్‌గూడ అటవీప్రాంతంలో రోడ్లను తవ్వి చెట్లను అడ్డంగా నరికి పడేశారు. అక్కడ బ్యానర్లు, పోస్టర్లు వదిలివెళ్లారు. మరోవైపు పంకజ్‌పూర్ జిల్లాలోని మూరూమ్‌గావ్ పోలీసుస్టేషన్ పరిధిలో మహారాష్టక్రు చెందిన వినయ్‌మిస్ర్తి అనే యువకుడిని ఇన్‌ఫార్మర్ అనే నెపంతో మావోలు హత్య చేశారు. ఇతను గడ్చిరోలి జిల్లా దనోర్‌తహసిల్‌కు చెందిన వ్యక్తి. పోలీసులకు మావోయిస్టు దళాల సమాచారం అందజేస్తున్నాడని మంగళవారం సాయంత్రం ఇతన్ని ఎత్తుకెళ్లారు. దంతెవాడ జిల్లాలోని కటేకల్యాణ్ పోలీసులు ఐదుగురు మావోయిస్టులను అరెస్టు చేశారు. వీరు ఇటీవల బస్సు దహనం చేసిన ఘటనలో, పోలీసు బలగాలపై కాల్పులు జరిపిన సంఘటనలో నిందితులుగా దంతెవాడ ఎస్పీ కశ్యప్ వివరించారు. నారాయణ్‌పూర్, పంకజ్‌పూర్, భానుప్రతాప్‌పూర్, జగ్దల్‌పూరు, సుకుమా, కాంకేర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లో మావోయిస్టుల బంద్ ప్రభావం కనిపించింది. అక్కడక్కడ దుకాణాలు మూతపడ్డాయి.