తెలంగాణ

పరిశోధనల్లో హైదరాబాద్ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: తార్నాకలోని ఐఐసిటి ఆడిటోరియంలో రిసెర్చ్ అండ్ ఇన్నో వేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్(రిచ్)ను కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో వరల్డ్ క్లాస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయని తెలిపారు. పరిశోధనల్లో దేశంలో హైదరాబాద్ టాప్ అని అన్నారు. నగరంలో 50కి పైగా ఇన్‌స్టిట్యూట్స్, సైన్స్, డిఫెన్స్, వ్యవసాయ రంగాల్లో పరిశోధనలు చేస్తున్నాయని చెప్పారు. లైఫ్ సైనె్సస్ అండ్ ఫార్మా రంగాల్లో హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెలికాఫ్టర్ క్యాబిన్ కూడా హైదరాబాద్‌లోనే తయారు అయిందని కెటిఆర్ తెలిపారు. ప్రపంచంలోని టాప్ ఐటి కంపెనీలు తమ కేంద్ర కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో 20కి పైగా ఇంక్యూబేషన్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. జపాన్, కోరియా లాంటి చిన్న దేశాలు ప్రపంచానికి అత్యుత్తమ ఉత్పత్తులను అందిస్తున్నాయని చెప్పారు. రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ అన్నింటిని ఒకే తాటిపైకి తీసుకు వస్తామని చెప్పారు. బషీర్‌బాగ్‌లోని పరిశ్రమ భవన్ నుంచి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ కార్యకలాపాలు నిర్వహిస్తామని చెప్పారు. సైన్స్, ఇన్నోవేషన్ సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని అన్నారు. పరిశోధనలకు సాంకేతికి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని కెటిఆర్ అన్నారు.