తెలంగాణ

భూదాన్ యజ్ఞ బోర్డును ఎందుకు ఏర్పాటుచేయలేదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: భూదాన్ యజ్ఞ బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదో రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మహారాష్టక్రు చెందిన సర్వ సేవా సంఘ్ దాఖలు చేసిన పిటీషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. 1965 తెలంగాణ భూదాన్, గ్రామ్‌దాన్ చట్టాన్ని అనుసరించి బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని పిటీషనర్ కోర్టుకు విన్నవించారు. దాదాపు లక్ష ఎకరాలకు పైగా బోర్డుకు చెందిన భూములు అన్యాక్రాంతంలో ఉన్నాయని పిటీషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. పిటీషనర్ వాదనపై స్పందించిన బెంచ్ చట్ట ప్రకారం బోర్డును నియమించాల్సి ఉండగా ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని అడిగింది. బోర్డు ఏర్పాటు చేసేందుకు ఏదైనా న్యాయపరమైన చిక్కులు ఉన్నాయా అని ప్రశ్నించిన బెంచ్ అఫిడవిట్ ద్వారా రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి తెలిపింది.