తెలంగాణ

పాత పింఛను విధానమే కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌పై తెలంగాణ ఉద్యోగుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (1980 ఎపి రివైజ్డ్ పెన్షన్ రూల్స్)ను అమలుచేయాలని కోరుతున్నారు. సంఘం అధ్యక్షుడు జి స్థితప్రజ్ఞ, ప్రధానకార్యదర్శి కె శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్‌లు పాత్రికేయులతో మాట్లాడుతూ పాత పెన్షన్ విధానం కోసం నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున శంఖారావం కార్యక్రమాన్ని, బహిరంగ సభను ఈ నెల 26న నిర్వహించనున్నట్టు చెప్పారు.
2004 సెప్టెంబర్ 1 తర్వాత నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు తప్పనిసరి ఈ శంఖారావానికి హాజరుకావాలని వారు సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వల్ల ఉద్యోగుల భవిష్యత్ షేర్ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుందని, ఉద్యోగి సామాజిక భద్రతకు సంబంధించి పెన్షన్ ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ విధానం పట్ల ఉద్యోగుల్లో అభద్రతా భావం నెలకొందని స్థితప్రజ్ఞ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నాయకులు ఇతర రాష్ట్ర సిపిఎస్ సంఘాల నాయకులు ఈ శంఖారావానికి హాజరవుతున్నారని, రాష్ట్రంలోని 31 జిల్లాల నుండి ఉద్యోగ, ఉపాధ్యాయులు వారు పనిచేసే విభాగాలకు అతీతంగా హాజరుకావాలని ఆయన కోరారు.
రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమమే దేశవ్యాప్తంగా మార్గదర్శకంగా మారుతుందని, జాతీయ స్థాయిలో దీనిని పెద్ద ఎత్తున నిర్వహించి పాత పెన్షన్ విధానాన్ని సాధిస్తామని వారు చెప్పారు.