తెలంగాణ

వారం రోజుల్లో 42డిగ్రీలకు ఉష్ణోగ్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: రానున్న వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరనున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం రాష్ట్రంలోని 21 జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు, మిగిలిన 10 జిల్లాల్లో 42 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది. మార్చి 3 నాటికి హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, కరీంనగర్, రాజన్న-సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, యాదాద్రి-్భవనగిరి, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో గరిష్టంగా 34 నుంచి 39 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉంది. అలాగే ఆదిలాబాద్, కొమరంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్-్భపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ-గద్వాల్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్ నుంచి 42 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.