తెలంగాణ

కన్నుల పండువగా వీరన్న కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురవి, ఫిబ్రవరి 25: మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి కల్యాణ మహోత్సవం మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ సమయంలో శనివారం 1:34గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ భక్తజనం జయజయధ్వానాల నడుమ కల్యాణం కన్నుల పండువ గా జరిగింది. రాష్ట్ర నలుమూలల నుండి అశేష భక్తజనం కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చి స్వామివారి సేవలో పునీతులయ్యారు. అధికారులు, ఆలయ చైర్మన్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను తోడ్కొని వచ్చి, స్వామివారికి సమర్పించారు. కల్యాణ వేదిక ప్రాంతమంతా వేలాదిమంది భక్తులతో కిక్కిరిసిపోయింది. కల్యాణానికి ముందే కల్యాణ వేదిక ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. కల్యాణ వేదికతోపాటు ఆలయం పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కల్యాణ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మహబూబాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

చిత్రం..కల్యాణాన్ని శాస్తయ్రుక్తంగా నిర్వహిస్తున్న వేదపండితులు