తెలంగాణ

సన్నాసులని వంద సార్లు అంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26:సన్నాసులను సన్నాసి అనకుంటే ఇంకేమంటామని మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు అసభ్య పదజాలంతో విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో తలసాని మాట్లాడారు. 60 ఏళ్లలో సాధించని దానిని రెండున్నర ఏళ్లలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించి చూపించిందని అన్నారు. 42 ఏళ్ల కాంగ్రెస్ ఏడుపుగొట్టు పాలనలో ఏం చేశారో ప్రజలకు తెలియదా? అని ప్రశ్నించారు. వ్యవసాయానికి తొమ్మిది గంటలు, గృహ అవసరాలకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తరువాతే ఇది సాధ్యం అయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రోజుకు ఆరేడు గంటల పాటు విద్యుత్ కోత విధించే వారని, వ్యవసాయానికి రెండు మూడు గంటల కన్నా ఎక్కువ విద్యుత్ సరఫరా చేయలేదని చెప్పారు.
అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేపడుతుంటే కాంగ్రెస్ నాయకులు అడ్డంకులు కల్పిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 5,936 పోస్టులను భర్తీ చేసిందని, కొత్త ఉద్యోగులు విధుల్లో కూడా చేరారని చెప్పారు. ఇప్పటికే 28వేల పోస్టులను భర్తీ చేయగా, మరో 24వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చినట్టు తెలిపారు.
బిసి వర్గాలకు మెరుగైన విద్య అందించేందుకు రాష్ట్రంలో 119 బిసి రెసిడెన్షియల్ పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని తెలిపారు. చేనేత, మత్స్య, యాదవ తదితర కుల వృత్తుల వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్టు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.