తెలంగాణ

రేవంత్‌రెడ్డి ఓ బచ్చా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, ఫిబ్రవరి 26: తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్‌రెడ్డికి రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవని, ఆయన ఓ బచ్చా అని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అభివర్ణించారు. ఆదివారం నిర్మల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి జైలుకెళ్లినా అతనికి బుద్ధిరాలేదని విమర్శించారు. వాల్‌పెయింటర్‌గా జీవితాన్ని ప్రారంభించిన రేవంత్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి వందలకోట్లు ఏ విధంగా సంపాదించాడో ప్రజలందరికీ తెలుసన్నారు. తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో సమైక్యాంధ్రకు మద్దతు పలికిన తెలంగాణ ద్రోహికి తనను విమర్శించే స్థాయి ఏమాత్రం లేదన్నారు. చంద్రబాబు చెప్పుచేతల్లో ఉంటూ ఆయన మెప్పుకోసం తప్పుడు ఆరోపణలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నాడని మండిపడ్డారు. తాను అవినీతికి పాల్పడ్డానని ఆరోపణలు చేస్తున్న రేవంత్.. దానిని నిరూపిస్తే రాజీనామా చేస్తానని, లేకుంటే పరువునష్టం కేసు వేసి జైలుకు పంపుతానని హెచ్చరించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభు త్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ సాధన కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారన్నారు. డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంపై విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. నిర్మల్ నియోజకవర్గంలోని తమ స్వగ్రామమైన ఎల్లపెల్లిలో ఇళ్ల నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. దాదాపు 50 ఇళ్ల నిర్మాణం పనులు స్లాబ్‌లెవెల్ వరకు చేరుకున్నా టిడిపి నాయకులకు అవి కనిపించడం లేదన్నారు. అంతకుముందు రూ.30 లక్షల నిధులతో ఎల్లపెల్లి గ్రామంలో నిర్మించనున్న సిసి రోడ్డు పనులను మంత్రి ప్రారంభించారు. అలాగే మరో రూ.37 లక్షలతో నిర్మించనున్న రక్షిత మంచినీటి ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి వెంట జిల్లా నాయకులు ముత్యంరెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, రాంకిషన్‌రెడ్డి, రాంకిషన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

చిత్రం..తన స్వగ్రామం ఎల్లపెల్లిలో మాట్లాడుతున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి