తెలంగాణ

బోగస్ జాబ్ మేళాలపై నిఘా పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఉప్పల్, ఫిబ్రవరి 26: హైదరాబాద్‌లో బోగస్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రముఖ కంపెనీల పేరుతో జాబ్ మేళాలు నిర్వహిస్తూ కన్సల్టెన్సీలు మోసానికి పాల్పడుతున్నాయి. అభ్యర్థుల నైపుణ్యతను గుర్తించకుండా కొందరు మోసానికి పాల్పడితే..డబ్బే ప్రామాణికంగా అభ్యర్థులను పెడదారి పట్టిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నగరంలో ఎన్నో చోటుచేసుకున్నా..తాజాగా ఆదివారం ఉప్పల్‌లో జరిగిన జాబ్‌మేళ వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులను అవహేళన చేసింది. ఇలాంటి బోగస్ సంస్థలపై ఇంటెలిజెన్స్, పోలీస్ నిఘా పెట్టాలని తెలంగాణ నిరుద్యోగ జెఎసి చైర్మన్ కోటూరి మానవతారాయ్ డిమాండ్ చేశారు. జాబ్ మేళా పేరుతో అక్రమార్జనకు పాల్పడుతున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని, బోగస్ సంస్థల పట్ల నిరుద్యోగ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
నిర్వాహకుడిపై కేసు
అద్వితీయ సేవా ఫౌండేషన్ నిర్వాహకుడు కుమార్‌పై ఐపిసి 420, 406, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఇన్‌స్పెక్టర్ వై నర్సింహారెడ్డి తెలిపారు.