తెలంగాణ

1 నుంచి 19 వరకు ఇంటర్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: ఇంటర్ మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఇంటర్ మీడియట్ బోర్డు ఒక యాప్‌ను రూపొందించింది. పరీక్షా కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవడానికి ఈ యాప్ విద్యార్థికి ఉపయోగపడుతుంది. పరీక్ష సెంటర్, అక్కడికి చేరుకునే దారి వంటి అన్ని వివరాలు ఈ యాప్ ద్వారా విద్యార్థికి ఉపయోగపడయని ఇంటర్ మీడియట్ బోర్డ్ కమీషనర్ అశోక్‌కుమార్ తెలిపారు. ఈ యాప్‌ను సోమవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేస్తారు. మార్చి ఒకటి నుంచి 19 వరకు ఇంటర్ మీడియట్ పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ మీడియట్ పరీక్షల కోసం 1,291 సెంటర్‌లో ఏర్పాట్లు చేశారు. హాల్ టికెట్లు ఇవ్వడం పూర్తయిందని, హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫీజులు చెల్లించాలని చెప్పి హాల్ టికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు ఆపితే సహించేది లేదని అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ఇంటర్ బోర్డ్‌కు ఫిర్యాదు చేయాలని చెప్పారు.