తెలంగాణ

ఏడుపాయల్లో వైభవంగా రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, ఫిబ్రవరి 26: ప్రపంచంలోనే రెండవ వనదుర్గామాత ఆలయంగా పేరు ప్రఖ్యాతులు గాంచిన మెదక్ జిల్లా శ్రీఏడుపాయల వనదుర్గాదేవి పుణ్యక్షేత్రంలో జరుగుతున్న శివరాత్రి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన రథోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండువగా జరిగింది. రథోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తొగుట, రాంపూర్ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, తెరాస రాష్ట్ర కార్యదర్శి ఎం.దేవేందర్‌రెడ్డి, ఆలయ ఈఓ టి.వెంకటకిషన్‌రావు, ఆర్డీఓ మెంచు నగేష్ తదితరులు హాజరై రథాంగ పూజల్లో పాల్గొని, రథోత్సవాన్ని లాగి తిలకించారు.
వనదుర్గాదేవి రథాన్ని వివిధ రకాల రంగురంగుల మెరుపు కాగితాలు, భారీ విద్యుత్ అలంకరణలు చేశారు. అంతకుముందు రథం గోలి వద్ద రథానికి పటం వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెరాస రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, ఆర్డీఓ మెంచు నగేష్, ఆలయ ఈఓ టి.వెంకటకిషన్‌రావు, ఏడుపాయల జాతర చీఫ్ ఫెస్టివల్ అధికారి సుధాకర్‌రెడ్డి, మెదక్ డిఎస్‌పి నాగరాజు, పాపన్నపేట తహశీల్దార్ జంగం రాములు, మెదక్ రూరల్ సిఐ రామకృష్ణ, ఎస్సై సందీప్‌రెడ్డి తదితరులు రథాంగ గోలి వద్ద రథోత్సవానికి ప్రత్యేక పూజలు నిర్వహించి లక్షలాది భక్తుల మధ్య రథోత్సవాన్ని ప్రారంభించారు.