తెలంగాణ

సమస్యలు పక్కన పెట్టి శతాబ్దిఉత్సవాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: ఎలాంటి గ్రేడ్ లేకుండా అనేక సమస్యలతో సతమతమవుతున్న ఉస్మానియా యూనివర్శిటీ (ఒయు) శతాబ్థి ఉత్సవాలను ఎలా నిర్వహిస్తారని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
సమస్యలను పరిష్కరించకుండా ఉత్సవాల పేరుతో ఆడంబరాలకు పోవడం వల్ల విద్యార్థులకు ఒరిగిందేమిటని సిఎం కెసిఆర్‌ను నిలదీశారు.
ఎ గ్రేడ్‌లో ఉండే యూనివర్శిటీ ఇప్పుడు ఎలాంటి గ్రేడ్ లేకుండా పోయిందని, ప్రొఫెసర్లు, సిబ్బంది ఖాళీలు భర్తీ కాలేదని, వౌలిక సదుపాయాలు అరకొరగా ఉన్నా పట్టించుకోకుండా శతాబ్ది ఉత్సవాలను నిర్వహించడం అంటే సమస్యలను మరుగునపెట్టేందుకేనని అన్నారు. ఆదివారం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ ఒయూకు ‘నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్’ (న్యాక్) గుర్తింపు లేదన్న సంగతి ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. న్యాక్ గుర్తింపు ఉంటే ఎక్కువ నిధులు రావడానికి వీలుండడమే కాకుండా యూనివర్శిటీ ఇచ్చే డిగ్రీలకు ఎక్కువ విలువ ఉంటుందని అన్నారు. అలాంటి న్యాక్ గుర్తింపు కోసం ప్రభుత్వం ప్రయత్నించిన పాపాన పోలేదని అన్నారు.
2001లో యూనివర్శిటీకి న్యాక్ గుర్తింపు లభించి, అప్పట్లో ఉత్తమ ప్రమాణాలు ఉన్న విశ్వవిద్యాలయంగా ఫైవ్ స్టార్ ర్యాంకును సాధించిందని వెల్లడించారు. తర్వాత 2008లో న్యాక్ బృందం ఎ-గ్రేడ్ యూనివర్శిటీగా గుర్తింపు నిచ్చిందని, అయితే ఈ గుర్తింపు 2013తో ముగిసిందని అన్నారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే యూనివర్శిటీలను చదువుల దేవాలయాలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం న్యాక్ గుర్తింపు కోసం ప్రయత్నించి ఉంటే ఈపాటికి వచ్చేదని రేవంత్ అభిప్రాయపడ్డారు.