తెలంగాణ

అమెరికా ఘటనలపై అత్యున్నత స్థాయిలో చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఫిబ్రవరి 26: అమెరికాలో జరుగుతున్న జాతి వివక్ష దాడుల నియంత్రణకు అక్కడి ప్రభుత్వంతో అత్యున్నత స్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. అమెరికాలోని కేన్సస్‌లో జాత్యహంకార అమెరికన్ కాల్పుల్లో మృతి చెందిన కూచిభొట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను వెంకయ్యనాయుడు, మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి పరామర్శించారు.
అనంతరం మీడియాతో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అమెరికాలో జరిగిన దుర్ఘటనలో భారతీయుడు శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో కావాల్సిన సహకారం అందించాలని కోరినట్లు తెలిపారు. అమెరికాలో వరుసగా జరుగుతున్న జాతి వివక్ష, కిరాతక సంఘటనల దృష్ట్యా ప్రవాస భారతీయులకు రక్షణ, విశ్వాసం కోసం కావాల్సిన చర్యలపై భారత ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
శ్రీనివాస్ భార్య సునయనతో తాను స్వయంగా మాట్లాడానని, ఆమె అమెరికా సమాజం ముందు వేసిన ప్రశ్నలు అందరికీ కనువిప్పు కలిగిస్తాయని చెప్పారు. అనంతరం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ అమెరికాలో శ్రీనివాస్‌పై జరిగిన కాల్పులు బాధాకరమైన, ఆందోళనకర ఘటన అని అన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అలోక్‌రెడ్డి తల్లిదండ్రులకు దత్తాత్రేయ పరామర్శ
అమెరికన్ చేతిలో గాయపడిన ఎం.అలోక్‌రెడ్డి కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి దత్తాత్రేయ, శాసనసభ్యుడు ఆర్.కృష్ణయ్య పరామర్శించారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ అమెరికాలో ఉంటున్న ప్రతి భారతీయులకు అన్ని రకాలుగా రక్షణ కల్పించేందుకు అక్కడ నివాసముంటున్న ఇండియన్ల నిపుణులు ఇస్తున్న సలహాలు సూచనలు పాటిస్తూ శాంతియుతంగా ఉండాలని సూచించారు. కాగా, తన కుమారుడి పరిస్థితిని తెలుసుకునేందుకు ఆదివారం అమెరికా బయలుదేరనున్నట్లు అలోక్‌రెడ్డి తండ్రి జగన్మోహన్‌రెడ్డి చెప్పారు.

చిత్రం..అమెరికా కాల్పుల్లో మృతి చెందిన శ్రీనివాస్ తల్లిదండ్రులను పరామర్శిస్తున్న
కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, బిజెపి ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి