తెలంగాణ

ఇచ్చి.. లాక్కుంటున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: ‘కుడిచేత్తో ఇచ్చి, ఎడమచేత్తో లాక్కున్న చందంగా’ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యవహరిస్తున్నారని బిజెపి శాసనసభా పక్ష నాయకుడు జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణి కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చి, ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు. సింగరేణి కార్మికుల క్రమబద్ధీకరణ వ్యవహారంపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన కెసిఆర్‌కు సవాల్ విసిరారు. సింగరేణి ప్రాంతం ఉన్న ఆరు జిల్లాల్లో ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు కిషన్ రెడ్డి, ఇతర బిజెపి నేతలు పర్యటించి కార్మికులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ ఆదివారం కిషన్‌రెడ్డితో ‘మీట్-ది-ప్రెస్’ నిర్వహించింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే 20 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని సిఎం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పైగా సింగరేణిలో ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు కూడా లేరని ముఖ్యమంత్రి జనవరి 5న అసెంబ్లీలో చెప్పి, సభ్యులను తప్పుదారి పట్టించారని విమర్శించారు. సింగరేణిలో 24 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని ఆయన తెలిపారు. తమ పర్యటన సందర్భంగా అనేక మంది కాంట్రాక్ట్ కార్మికులు వచ్చి గుర్తింపు కార్డులు చూపించారని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ గత ఏడాది ఏప్రిల్‌లో సర్క్యులర్ జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. వేతనాలపై సుప్రీం కోర్టు గత ఏడాది సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు.
సింగరేణి కార్మికులు సైనికుల్లా పని చేస్తారని లోగడ అన్న సిఎం, ఆ సైనికులకు పన్ను మినహాయింపునివ్వాలన్నారు. బొగ్గు గనుల్లో పని చేస్తున్న కార్మికుల ఊపిరితిత్తులు త్వరగా దెబ్బతింటున్నాయని, నల్లగా మారిపోతున్నాయని ఆయన తెలిపారు. వారికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో చికిత్స పొందే సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని, వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, కనీస వేతనాల చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కిషన్ రెడ్డి కోరారు.