తెలంగాణ

మద్దతు ధర కోసం రోడ్డెక్కిన మిర్చి రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, ఫిబ్రవరి 26: మిర్చి పంటకు మద్దతు ధర 20వేల రూపాయలు ప్రకటించాలని, పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకుడు కడియాల వీరాచారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. మిర్చికి మద్దతు ధర కల్పించాలని, పంట నష్టపోయిన బాధిత రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం భూపాలపల్లి జిల్లా నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి ప్రధాన రహదారిపై ఎండు మిర్చి పోసి తగులబెట్టి నిరసన తెలిపారు. ఈసందర్భంగా వీరాచారి మాట్లాడుతూ, ఎన్నో ఆశలతో మిర్చి రైతులు పంట పండిస్తే మార్కెట్‌లో ధర లేక పెట్టిన పెట్టుబడులు చేతికి రాక రైతాంగం ఆర్థికంగా నష్టానికి గురవుతున్నారని వాపోయారు. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందులతో పంట చేతికి రాక చేసిన అప్పులు తీర్చ లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగంపై సవతి తల్లి ప్రేమను మానుకుని క్వింటాల్ మిర్చికి కనీసం 20వేల రూపాయల మద్దతు ధర ప్రకటించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు.