తెలంగాణ

పేద బ్రాహ్మణులకు సంక్షేమ ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: తెలంగాణ రాష్ట్రంలో పేదరికంలో మగ్గుతున్న బ్రాహ్మణులకు సంక్షేమ ఫలాలు అందిస్తామని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డాక్టర్ కెవి రమణాచారి తెలిపారు. పరిషత్ నేతృత్వంలో ఆదివారం బాలాజీ భవన్‌లో జరిగిన బ్రాహ్మణ పరిషత్ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని పేద బ్రాహ్మణులకు చేయూత ఇవ్వాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వివిధ చర్యలు తీసుకున్నారన్నారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఏర్పాటు, వార్షిక బడ్జెట్‌లో బ్రాహ్మణుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయల కేటాయింపు, బ్రాహ్మణ సదన్‌కు స్థలం కేటాయింపు, వివిధ జిల్లాల్లో బ్రాహ్మణ సదనాలకు నిధుల కేటాయింపు చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను సొసైటీల చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేశామని, దీని వల్ల ప్రభుత్వం నిధులు కేటాయించేందుకు వీలవుతుందని, ఈ నిధులు మురిగిపోయే పరిస్థితి కూడా ఉండబోదన్నారు.
బ్రాహ్మణుల సమస్యలను అన్నికోణాల్లో ఆలోచించి సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్టర్రాజధానిలో బ్రాహ్మణ సదనం భవనం నిర్మాణం కోసం గోపన్‌పల్లిలో ప్రభుత్వం ఆరెకరాల భూమి కేటాయించిందన్నారు. తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి, తిరుచానూరులోని పద్మావతి అమ్మవారికి కెసిఆర్ బంగారు ఆభరణాలు చేయించడం చరిత్రలో గొప్ప నిర్ణయమని, మైసూరురాజులు, కాకతీయ రాజులు తిరుమల స్వామికి ఆభరణాలు చేయించారని, ఇప్పుడు మళ్లీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆభరణాలు చేయించడం చారిత్రాత్మక విషయమన్నారు.
సిఎం కెసిఆర్ బ్రాహ్మణుల సాంప్రదాయాలపట్ల విశ్వాసం ఉన్నవాడని బ్రాహ్మణ పరిషత్ సభ్యుడు, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి తెలిపారు. బ్రాహ్మణులకు సంబంధించి ప్రస్తుతం పనిచేస్తున్న సంఘాలన్నీ కలిసి సంఘటితంగా ముందుకు సాగాలన్నారు. బ్రాహ్మణ పరిషత్తు ద్వారా ప్రతి పేద బ్రాహ్మణుడికి సాయం అందుతుందని పరిషత్ మరోసభ్యుడు, ఎమ్మెల్సీ పురాణం సతీష్ పేర్కొన్నారు.బ్రాహ్మణులకు ప్రధాన వృత్తి పౌరోహిత్యం, అర్చకత్వమేనని, అయితే ఉపాధికోసం ఇతర ఏ వృత్తి చేపట్టినా నాణ్యత ఉండేలా పనిచేయాలని మాజీ డిజిపి రొడ్డం ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. హిందూసమాజం సంక్షేమం కోసం పనిచేస్తున్న అర్చకులు, పురోహితులు, వేదపండితులను ప్రోత్సహించాల్సి ఉందని మరొక మాజీ డిజిపి కె.అరవిందరావు అన్నారు.
సమస్యల ‘తో’రణం
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ విస్తృతస్థాయి సమావేశానికి రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున ఈ సమావేశానికి హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో బ్రాహ్మణుల సమస్యలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో దాదాపు 85 మంది మాట్లాడారు. కొందరు రాతపూర్వకంగా తమ అభిప్రాయాలు తెలిపారు. వీరి సూచనలు, సలహాలు ఇలా ఉన్నాయి.
* ప్రతి జిల్లాలో బ్రాహ్మణ భవన్ ఏర్పాటు చేయాలి.
* వేదపాఠశాలలు, సంప్రదాయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి.
* బ్రాహ్మణ కుటుంబాల స్థితిగతులపై సర్వే చేయించాలి
* పూజరులకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇప్పించాలి.
* పేదవారికోసం ‘కల్యాణలక్ష్మి’ పథకం వర్తింపచేయాలి.
* విదేశాల్లో చదువులకు ఆర్థిక సాయం చేయాలి
* పోటీపరీక్షల కోసం స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలి.
* యువతకు, మహిళలకు ఉపాధి, నైపుణ్య శిక్షణ ఇప్పించాలి.
* జిల్లాస్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలి.
* అపరకర్మల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం ఉండాలి.
* సినిమాల్లో బ్రాహ్మణులను కించపరచకుండా చర్యలు తీసుకోవాలి.
* అర్చకులకు ట్రెజరీద్వారా వేతనాలు ఇచ్చేలా చూడాలి.
* ప్రత్యేకంగా బ్రాహ్మణ వేధింపుల నిరోధ చట్టం తీసుకురావాలి. ఎవరైనా నిందిస్తే కనీసం మూడేళ్ల జైలుశిక్ష పడేలా చట్టసవరణ చేయాలి.
* గృహనిర్మాణానికి వడ్డీలేని రుణసౌకర్యం కల్పించాలి.
కూచిభొట్ల శ్రీనివాస్‌కు నివాళి
అమెరికా శే్వతజాతి ఉన్మాది చేతిలో హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్ కూచిబొట్ల శ్రీనివాస్ హత్యకు గురవడం పట్ల పరిషత్ సంతాపాన్ని వ్యక్తం చేసింది.

చిత్రం..బ్రాహ్మణ పరిషత్ విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన నాయకులు