తెలంగాణ

కెటిఆర్‌తో మిస్సోరీ బృందం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: రాష్ట్రంలో విద్యా, వ్యాపార అవకాశాలను పరిశీలించేందుకు అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రానికి చెందిన బృందం మూడు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణకు వచ్చింది. ఈ బృందం సోమవారం ఐటి శాఖ మంత్రి తారక రామారావును కలిసింది. విద్యా, వ్యాపార అవకాశాల పరిశీలనలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ, టి-హబ్, జినోమ్ వ్యాలీ, ఇక్రిసాట్ వంటి సంస్థలను ఈ బృందం సందర్శించనుంది. ఉస్మానియా యూనివర్సిటీలో డ్యూయల్ డిగ్రీ కోర్సు ఏర్పాటుకు గల అవకాశాలను ఈ బృందం పరిశీలిస్తుంది. చివరి రోజు తెలంగాణలోని కంపెనీల సిఇఓలతో ప్రతినిధి బృందం సమావేశం అవుతుంది. మిస్సోరి అభివృద్ధిలో కీలకమైన మిస్సోరీ పార్ట్‌నర్‌షిప్ సంస్థ ప్రతినిధులు, సెయింట్ లూయిస్ రీజినల్ చాంబర్, మిస్సోరి ప్రభుత్వాధికారులు ఈ బృందంలో ఉన్నారు. మంత్రితో జరిగిన సమావేశంలో హైదరాబాద్ అమెరికన్ కాన్సులెట్ జనరల్ క్యాథరిన్ హెడ్డా కూడా పాల్గొన్నారు. పరిశోధనలకు ఊతం ఇచ్చేవిధంగా టి-హబ్, సెయింట్ లూయిస్ పట్టణంలోని టి-రెక్స్ ఇంక్యూబెటర్ కలిసి పని చేసేందుకు ఈ బృందం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుకుంది. తెలంగాణలో టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని కెటిఆర్ ఈ సందర్భంగా తెలిపారు. సిలికాన్ వ్యాలీలో తాము ఏర్పాటు చేసిన టి-బ్రిడ్జ్ భాగస్వామిగా టి-రెక్స్ పని చేయడం ద్వారా అక్కడ ఉన్న టెక్నాలజీ, ఇక్కడి టి-హబ్‌లో ఉన్న ఆవిష్కరణలకు మధ్య ఒక వారధిగా ఈ ఒప్పందం పని చేస్తుందని అన్నారు. మిస్సోరి రాష్ట్రంలో పర్యటించాలని కెటిఆర్‌ను ఈ బృందం ఆహ్వానించింది.

చిత్రం..సోమవారం హైదరాబాద్‌లో మంత్రి కెటిఆర్‌ను కలిసిన మిస్సోరీ బృందం