తెలంగాణ

దండుమల్కారం టిఐఎఫ్-గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలో దండుమల్కారంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య (టిఐఎఫ్)-గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. జర్మనీకి చెందిన జిఐజడ్ సంస్థ సహకారంతోదేశంలోనే కాలుష్య రహిత పార్కుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. సోమవారం పరిశ్రమ భవన్‌లో బాలమల్లుతో జిఐజడ్ సస్థ ప్రాజెక్టు డైరక్టర్లు డైటర్ బ్రులెజ్, రఘుబాబు నూకల సమావేశమయ్యారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల విస్తరణ, కొత్తవి ఏర్పాటు చేసేందుకు దండుమల్కారంలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా బాలమల్లు తెలిపారు. ప్రత్యేకించి ఈ పార్కును కాలుష్య రహితంగా దేశంలోనే వౌడల్ ఇండస్ట్రియల్ పార్కుగా తీర్చిదిద్దాలన్నది సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ లక్ష్యమని అన్నారు. ఇందుకోసం ప్రాజెక్టు రూపకల్పనలో అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న జర్మనీకి చెందిన జిఐజడ్ సంస్థ సహకారాన్ని తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. జర్మనీ సంస్థ ప్రాజెక్టు నివేదిక అందించగానే ప్రభుత్వానికి పంపించి ఆమోదం తీసుకుంటామని అన్నారు. అనంతరం పార్కు అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని బాలమల్లు స్పష్టం చేశారు.