తెలంగాణ

కొత్త పద్ధతుల్లో ఉద్యమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: నిరుద్యోగ నిరసన ర్యాలీని ప్రభుత్వం అడ్డుకున్నందున, మున్ముందు కొత్త పద్ధతుల్లో ఉద్యమాలు చేపట్టాలని తెలంగాణ జెఎసి నిర్ణయించింది. టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండ రామ్ అధ్యక్షతన సోమవారం టి.జెఎసి కార్యాలయంలో జరిగిన సమావేశంలో 31 విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ నెల 22న నిర్వహించాలనుకున్న నిరుద్యోగ నిరసన ర్యాలీని ప్రభుత్వం భగ్నం చేయడం, లోపాలు ఎక్కడ ఉన్నాయి, ఇంకా ఎలా చేస్తే బాగుండేదన్న అంశాలపై కోదండరామ్ విద్యార్థి సంఘాల నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి బయలుదేరిన నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి, నగర శివార్లలోనూ బ్యారికేడ్లు పెట్టి అడ్డుకుని, ముందస్తు అరెస్టులు చేసి ర్యాలీ విఫలమైందని టిఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారని వివిధ సంఘాల నాయకులు మండిపడ్డారు. టి.జెఎసి వైస్ చైర్మన్ ప్రహ్లాద్ మాట్లాడుతూ ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో ధర్నాలు చేయకుండా నిషేధించాలన్న ప్రభుత్వ ఆలోచనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా చౌక్‌గా గత ప్రభుత్వమే ఇందిరా పార్కును ఎంపిక చేసిందని ఆయన తెలిపారు. ఇప్పుడు నాగోల్ లేదా కీసరకు మార్చాలని ప్రభుత్వం భావించడం భావ్యం కాదని అన్నారు. పార్లమెంటుకు కిలో మీటర్ దూరంలో ఉన్న జంతర్-మంతర్ వద్ద ధర్నాలు చేసేందుకు పోలీసుల అనుమతి తీసుకోనవసరం లేదని, కేవలం సమాచారం ఇస్తే సరిపోతుందని అన్నారు. కోల్‌కతాలో కూడా ఎటువంటి నిబంధనలు లేవని, నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఉందని ఆయన తెలిపారు.
పిట్టల రవీందర్‌పై భిన్నాభిప్రాయాలు
ఇలాఉండగా ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఘాటుగా విమర్శించిన పిట్టల రవీందర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిసింది. పిట్టలను మళ్లీ టి.జెఎసి కార్యాలయం మెట్లు ఎక్కనీయరాదని కొందరు గట్టిగా వాదించగా, అందరినీ కలుపుకుని పోవాలని మరి కొందరు అభిప్రాయపడినట్లు తెలిసింది. కాగా ప్రొఫెసర్ కోదండరామ్ ఏమీ మాట్లాడకుండా అన్నీ ఓపిగ్గా విన్నారని టి.జెఎసి నేత ఒకరు చెప్పారు.