తెలంగాణ

జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల్లో అవినీతి నిరూపణకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల్లో కోట్లాదిరూపాయలు ముడుపులు తీసుకుని ప్రైవేటు సంస్థలకు అనుకూలంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణకు తాను కట్టుబడి ఉన్నానని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అవినీతిని నిరూపించేందుకు తాను చర్చకు ఎక్కడకు పిలిచినా వస్తానని అన్నారు. సోమవారం ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన ఆరోపణలకు బదులివ్వకుండా వ్యక్తిగత దూషణలకు దిగితే ఇంద్రకరణ్‌రెడ్డి బతుకేమిటో బయటపెడతానని హెచ్చరించారు. ‘1987లో టిడిపి నిన్ను జడ్పీ చైర్మన్‌ను చేసింది, 1991లో ఎంపిగా గెలిపించి పార్లమెంట్‌కు పంపితే అక్కడ పివి నర్సింహారావుకు అమ్ముడుపోయిన చరిత్ర నీది’ అంటూ ఇంద్రకరణ్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ‘ఆ తర్వాత కాంగ్రెస్‌లోనైనా సక్రమంగా ఉన్నావంటే అదీ లేదని, వైఎస్ దగ్గర చేరి కాంట్రాక్టులు సంపాదించుకుని తర్వాత ఆ పార్టీకి పంగనామాలు పెట్టావని’ విమర్శించారు. మళ్లీ మాయావతి వద్దకు వెళ్లి బిఎస్పీ టిక్కెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాయావతిని కూడా మోసగించి టిఆర్‌ఎస్‌లో చేరిన చరిత్ర నీదని ఎద్దేవా చేశారు. జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల్లో భారీగా ముడుపులు చేతులు మారాయని, ప్రభుత్వానికి రావాల్సిన 3 వేల కోట్ల ఆదాయానికి గండిపడిందని అన్నారు. కమీషన్లు తీసుకుని ఆయా వెంచర్లకు ఎన్‌వోసిలు ఇస్తున్నారని ఆరోపించారు. తాను చేస్తున్న ఆరోపణ నిర్ధిష్టమైనదని అన్నారు.