తెలంగాణ

పిహెచ్‌డి ఫలితాలను ప్రకటించిన ఉస్మానియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ఉస్మానియా విశ్వవిద్యాలయం పిహెచ్‌డి అడ్మిషన్లకు ఎంపికైన అభ్యర్ధుల పేర్లను సోమవారం రాత్రి విడుదల చేసింది. 2013-14 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఈ ఫలితాల విడుదలపై సోమవారం నాడు పెద్ద హైడ్రామానే నడిచింది. విద్యార్ధులు అంతా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ కార్యాలయాన్ని ముట్టడించి, ఫలితాలను తక్షణం విడుదల చేయాలని గట్టిగా డిమాండ్ చేయడంతో విసి ఆదేశాల మేరకు అడ్మిషన్స్ డీన్ ఫలితాలను విడుదల చేశారు. ఎడ్యుకేషన్ సబ్జెక్టు మినహా మిగిలిన ఆర్టు, కామర్స్, మేనేజిమెంట్, లా, సైనె్సస్ విభాగాల్లోని అన్ని సబ్జెక్టుల ఫలితాలను విడుదల చేశారు.