తెలంగాణ

ఎగ్జామ్ సెంటర్ లొకేటర్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష కేంద్రాల సమాచారాన్ని సులువుగా తెలుసుకునేందుకు ఇంటర్ విద్యాశాఖ ‘ఎగ్జామ్ సెంటర్ లొకేటర్’ పేరుతో యాప్‌ను ఆవిష్కరించింది. సచివాలయంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఈ యాప్‌ను విడుదల చేశారు. పరీక్షల సమయంలో విద్యార్ధులు ఇబ్బందులు పడకూడదనే ఉద్ధేశ్యంతో దేశంలోనే తొలిసారిగా ఈ తరహా ప్రయత్నం చేసినట్టు ఆమె తెలిపారు. హాల్‌టిక్కెట్ నెంబర్ సహాయంతో పరీక్ష కేంద్రం పూర్తి చిరునామా, సెల్‌ఫోన్ నెంబర్లు తెలుసుకోవడంతో పాటు పరీక్ష కేంద్రానికి దగ్గరి దారి, వెళ్లేందుకు పట్టే సమయం, ట్రాఫిక్ వివరాలు కూడా తెలుసుకోవచ్చని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా రంజీవ్ ఆచార్య మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం విద్యావ్యవస్థను పటిష్టం చేస్తోందని చెప్పారు. విద్యార్ధుల పరీక్ష కేంద్రాల జంబ్లింగ్ కారణంగా పరీక్ష సమయంలో సెంటర్‌లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని దానిని దృష్టిలో ఉంచుకుని ఈ లొకేటర్ యాప్‌ను విడుదల చేశామని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే ఇలాంటి యాప్ రూపొందించడం ఇదే మొదటిసారి అని ఆమె చెప్పారు. విద్యార్ధులు యాప్‌ను అండ్రాయిడ్ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని హాల్‌టిక్కెట్ నెంబర్ ఎంటర్ చేస్తే ఎగ్జామ్ సెంటర్ బిల్డింగ్‌తో పాటు లొకేషన్ రూట్ మ్యాప్‌ను చూపిస్తుందని ఆమె అన్నారు.
ఆన్‌లైన్‌లో హాల్‌టిక్కెట్లపై
ప్రైవేటు యాజమాన్యాల అసంతృప్తి
ఫీజులు కట్టకపోయినా, హాజరు లేకున్నా విద్యార్ధులు వెబ్‌సైట్లో హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకుని పరీక్ష రాసుకోమనడం సబబుకాదని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందరూ పరీక్ష రాయవచ్చు అనే విధానం ఉంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, బయోమెట్రిక్ హాజరు వంటి అంశాల గురించి పదే పదే మాట్లాడటంలో అర్థం లేదని ప్రైవేటు జూనియర్ కాలేజీల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
పరీక్షలకు భారీ ఏర్పాట్లు
తెలంగాణలో పరీక్షల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశామని బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. పరీక్షకు 9,76,631 మంది హాజరవుతున్నారని, అందులో ఫస్టియర్ 4,75,832 మంది, సెకండియర్ 5,00799 మంది ఉన్నారని, వీరికోసం 1291 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. సెల్‌ఫోన్లపై జిపిఎస్ నిఘా ఉంటుందని, సెల్‌వాడితే కేసులు తప్పవని చెప్పారు. ఇన్విజిలేషన్‌కు 26,170 మందిని నియమించామని, 9వ తేదీ పరీక్షను 19వ తేదీన నిర్వహిస్తున్నామని అన్నారు.

చిత్రం..ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష కేంద్రాల సమాచారాన్ని సులువుగా తెలుసుకునేందుకు ఇంటర్ విద్యాశాఖ ‘ఎగ్జామ్ సెంటర్ లొకేటర్’ పేరిట యాప్‌ను ఆవిష్కరించింది. సచివాలయంలో సోమవారం యాప్‌ను విడుదల చేస్తున్న విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య