తెలంగాణ

84లక్షల గొర్రెలు వచ్చేస్తున్నాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: వివిధ రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి ఒకేసారి 84లక్షల గొర్రెలు రాబోతున్నాయి. ఒక సారి ఇంత పెద్ద మొత్తంలో గొర్రెల పంపిణీ దేశంలో ఇదే మొదటి సారి. ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెల కొనుగోళ్ల కోసం ఇప్పటికే అధికారుల బృందం వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఒక అవగాహనకు వచ్చింది. ఇప్పటి వరకు గొర్రెల కొనుగోళ్లకు 20 శాతం సబ్సిడీ ఇచ్చే వాళ్లు. 20 శాతం సబ్సిడీతో 1300 మందికి 115 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చినట్టు షిప్, గోట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కె రాజయ్య యాదవ్ తెలిపారు. ఇప్పుడు 75 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ చేస్తారు. ఐదువేల కోట్ల రూపాయలతో 84లక్షల గొర్రెలను వివిధ రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. రెండేళ్లలో ఇవి రెట్టింపు అవుతాయి. ఐదువేల కోట్ల రూపాయలతో నాలుగు లక్షల మందికి 75శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేస్తారు. గొర్రెల పంపిణీపై విధి విధానాలు రూపొందించేందుకు ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ మంగళవారం సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో విధి విధానాలను ఖరారు చేస్తారు. 75శాతం సబ్సిడీ ఇస్తున్నందున ‘నక్కలు’ ప్రవేశించే అవకాశం ఉందని, యాదవ, కుర్మ సోదరులు అప్రమత్తంగా ఉండాలని రాజయ్య సూచించారు. హైదరాబాద్ నగరానికి రోజుకు రాజస్థాన్ లాంటి రాష్ట్రాల నుండి 300 లారీల్లో గొర్రెలను, మేకలను దిగుమతి చేసుకుంటున్నట్టు చెప్పారు. సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా ఈ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని రాజయ్య తెలిపారు. ఈ పథకాన్ని ఆషామాషిగా తీసుకోవడం లేదని కోళ్ల ఫారాలతో సమానంగా గొర్ల ఫారాలు అభివృద్ధి చేసుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం వెళుతోందని చెప్పారు. కార్లలో భార్యను ఎక్కించుకుని గొర్ల ఫారానికి తీసుకు వెళ్లే రోజులు రావాలని సిఎం చెబుతున్నారని రాజయ్య యాదవ్ తెలిపారు.