తెలంగాణ

యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 27: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి దేవస్థానం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం 8:45 గంటలకు ఆగమశాస్త్రానుసారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకులు నందీగల్ నరసింహాచార్యులు నేతృత్వంలోని పండిత బృందం స్వామివారి బాలాలయంలో శ్రీ విష్వక్సేనారాధన, స్వస్తివచనాలతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి మేళతాళాలు, నాదస్వరాల మధ్య బ్రహ్మోత్సవాల ప్రారంభోత్స వం జరిగింది. సాయంత్రం 6:30 గంటలకు మృత్సంగ్రహణం, అంకురారోపణం పూజాదికాలు నిర్వహించారు. ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నరసింహాచార్యులు బ్రహ్మోత్సవాల ప్రారంభ పూజాధికాలలో పాల్గొన్నారు. అయతే, తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధినొందిన యాదాద్రి బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు ఎవరూ పాల్గొనలేదు. భువనగిరి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి వచ్చిన మంత్రులు టి.హరీష్‌రావు, జి.జగదీష్‌రెడ్డి పక్కనే ఉన్న యాదాద్రి బ్రహ్మోత్సవాలకు రాకుండానే వెళ్లిపోయారు. బ్రహ్మోత్సవాల్లో రెండ వరోజు మంగళవారం ఉదయం 11 గంటలకు ధ్వజారోహణ, సాయంత్రం 6:30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవనం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. బుధవారం నుండి స్వామివారికి అలంకార, వాహన సేవలు ప్రారంభమవుతాయి. మార్చి4 నుండి నాలుగు రోజుల పాటు ధార్మిక, సాహిత్య, సంగీ త, సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ తేదీన స్వామివారి తిరుకల్యాణోత్సవం నిర్వహించనున్నారు.

చిత్రం..ముస్తాబైన యాదాద్రి లక్ష్మీనారసింహుడు