తెలంగాణ

కెసిఆర్ ఆలోచనలకు అర్థాలే వేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఫిబ్రవరి 27: దొంగలు, తాగుబోతులు, అవినీతి పరులకు ఎలాంటి ఆలోచనలు వస్తాయో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వైఖరి అలాగే ఉందని టి.పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. సోమవారం సంగారెడ్డిలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం లో నిర్వహించిన జన ఆవేదన సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కోసం రూ.60 వేల కోట్లు అప్పు చేస్తే టిఆర్‌ఎస్ ప్రభు త్వం కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే రూ.60 వేల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ అని చెప్పుకున్న కెసిఆర్‌కు భారీ మొత్తంలో అప్పు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై సిఎం కెసిఆర్ మాటమార్చారన్నారు. కెసిఆర్ చంచల ఆలోచనల విధానాలే ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుపడుతున్నాయన్నారు. 60 వేల కోట్ల అప్పుచేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15 వేల కోట్ల రైతుల అప్పులను ఎందుకు తీర్చడం లేదో జవాబు చెప్పాలని కోరారు. కెసిఆర్ రైతు వ్యతిరేక సిఎంగా చరిత్రలో మిగిలిపోతారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టిన సమయంలో కెసిఆర్ ఎక్కడున్నారో ఆయనకే తెలియదన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తాను స్వయంగా వెళ్లి పరిశీలించినట్లు పొన్నాల పేర్కొన్నారు. రాష్ట్రం లో ఉద్యమం ఉదృతంగా కొనసాగుతున్న సమయంలో సిఎం కెసిఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో పడుకున్నారని ఆరోపించారు. సిఎం పదవి మొదలుకుని మిగ తా అన్ని సందర్భాల్లో దళితులకు ద్రోహం చేసారని ధ్వజమెత్తారు. రైతుల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్నారు. కెసిఆర్ కుటుంబ పాలనకు బుద్ది చెప్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త ప్రతీన బూనాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలే దేవుళ్లుగా మాట్లాడిన కెసిఆర్ అధికారం చేపట్టాక ప్రజలకిచ్చిన హామిలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. 1985-86లో గోదావరి జలాల కోసం పోరాటం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. కాంగ్రెస్ రూపొందించిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని రాజ్యాంగ బద్దంగా వ్యవహరించి నిధులను దారిమళ్లిస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థలో భారత దేశాన్ని ప్రపంచంలో మూడవ స్థానంలో నిలిపిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా అని ప్రశ్నించారు. పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని మోదీ నల్లకుబేరులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. 600 మంది నల్లకుబేరుల పేర్లను బయటపెట్టకుండా రహస్యంగా ఉంచడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.