తెలంగాణ

మెరిట్ ఆధారంగా ఎఇ పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: తెలంగాణ విద్యుత్ శాఖలో మిగిలిన 238 అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టులను మెరిట్ అధారంగా భర్తీ చేయ్యల ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయతే నియామక పత్రాలను మాత్రం ఇప్పుడే ఇవ్వొద్దని స్పష్టం చేసింది. మెరిట్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు విద్యుత్ సంస్థలు ఇప్పటికే సుప్రీంకోర్టులో అఫిడవిట్లు సమర్పించాయి. ఈ అఫిడవిట్లపై నాలుగు వారా ల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు సుప్రీకోర్టు ఆదేశాలు జారీచేసింది. 2015లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అసిస్టెంట్ ఇంజినీర్ల నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. విద్యుత్ అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకాల కోసం తెలంగాణలోని నాలుగు విద్యుత్ సంస్థలు 2015 లో వేరువేరుగా నోటిఫికేషన్లు ప్రకటించాయి. దీంతో అభ్యర్థులు దాదాపు నాలుగు సంస్థల కూ దరఖాస్తు చేసుకున్నారు. ఇలా 238 మం ది అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ సంస్థల్లో అర్హత సాధించారు. దీని ఫలితంగా 238 ఉద్యోగాలు భర్తీ కాలేదు. తర్వాత మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీకి వెసులుబాటు కల్పిస్తు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయంచా రు. అలాగే 1997 జీవో ప్రకారం ఒక్క సీటు కు 1:1 నిష్పత్తిలో పిలవాలని, కాబట్టి మిగిమిపోయిన ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదల చేసి మళ్లీ కొత్తగా నియామకా లు జరిపేలా ఆదేశాలు జారీ చేయాలని వారు హైకోర్టును కోరారు. దీంతో ఉమ్మడి హైకోర్టు పిటిషన్‌దారులకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ మరికొందరు అభ్యర్థులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, కోలిన్ గోంజాల్విస్ వాదనలు వినిపించారు.