తెలంగాణ

అధికార లాంఛనాలతో.. శివశంకర్ అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 28: కాంగ్రెస్ నాయకులు, కుటుంబ సభ్యులు, బంధు-మిత్రులు, అభిమానుల ఆశ్రునయనాల మధ్య పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్ భౌతికకాయానికి మంగళవారం ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. సోమవారం మరణించిన పి. శివశంకర్ అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించిన సంగతి తెలిసిందే. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని శివశంకర్ నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవరైనా మరణిస్తే పార్టీ కార్యకర్తల సందర్శనార్థం పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్‌కు తీసుకుని రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు శివశంకర్ పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి గాంధీ భవన్‌కు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో తీసుకుని వచ్చారు. అక్కడ టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, మాజీ ఎంపీలు వి. హనుమంత రావు, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు మాగం రంగారెడ్డి, ఆకుల లలిత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తదితరులు శివశంకర్ భౌతికకాయంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. ఆ తర్వాత అక్కడి నుంచి పురానాపూల్‌కు తీసుకుని వెళ్ళారు. ఈ అంతిమ యాత్రలో అనేక మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్మశాన వాటికలో శివశంకర్ గౌరవార్థం పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. చితికి ఆయన కుమారుడు డాక్టర్ వినయ్ కుమార్ నిప్పుఅంటించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జ ఏర్పాట్లు చేయించారు. ఎంపి కెవిపి రామచందర్ రావు, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మర్రి శశిధర్ రెడ్డి, హనుమంతరావు, అంజన్‌కుమార్ యాదవ్, కావూరి హాజరయ్యారు.