తెలంగాణ

వెటర్నరీ వర్సిటీలో ఖాళీల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 28: పివి నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో (హైదరాబాద్) 10 కీలకపోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన, ఏడు పోస్టులను ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం మంజూరి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం జీఓ జారీ అయింది. ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్. శివశంకర్ పేరుతో జీఓ ఎంఎస్ నెంబర్ 39 జారీ చేశారు. వైస్-్ఛన్సలర్ పోస్టు ఒకటి, రిజిస్ట్రార్, డీన్ (వెటర్నరీ, డెయిరీ, ఫిషరీస్), డైరెక్టర్ రీసర్చ్, డైరెక్టర్ ఎక్స్‌టెన్షన్, కంప్ట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్, కంప్ట్రోలర్, ఎస్టేట్ ఆఫీసర్, యుడి స్టెనో ఒక్కొక్క పోస్టుకు మంజూరు ఇచ్చారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో నలుగురు అటెండర్లు/ఆఫీస్ సబార్డినేట్స్, ఇద్దరు డ్రైవర్లు (ఎల్‌ఎంవి), ఒక ఎలక్ట్రీషిన్ పోస్టును మంజూరు చేశారు. ఈ పోస్టులను భర్తీ చేసేముందు ఆర్థిక (మానవ వనరులు) శాఖ అనుమతి తీసుకోవాలని సంబంధిత అధికారులను శివశంకర్ ఆదేశించారు.