తెలంగాణ

కౌన్సిల్ ఎన్నికల్లో ‘అలయ్-బలయ్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 28: కాంగ్రెస్‌తో పూర్తిగా తెగతెంపులు చేసుకున్న మజ్లిస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి చేరువై కలిసి ప్రయాణిస్తోంది. టిఆర్‌ఎస్ కూడా అంతే చేరువ అయ్యిందనడానికి తాజాగా శాసనమండలికి (కౌన్సిల్) జరుగుతున్న ఎన్నికలే నిదర్శనం. కౌన్సిల్‌కు స్థానిక సంస్థల (జిహెచ్‌ఎంసి) కోటాలో ఒక స్థానానికి ఖాళీ ఏర్పడింది. మజ్లిస్ ఎమ్మెల్సీ సయ్యద్ అమీన్ జాఫ్రీ పదవీ కాలం ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కాగా మజ్లిస్ పార్టీ తిరిగి జాఫ్రీ పేరునే ప్రకటించడంతో, మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఎమ్మెల్యేల కోటా నుంచి కౌన్సిల్‌కు జరగనున్న మూడు స్థానాలకూ నోటిఫికేషన్ జారీ అయ్యింది. మజ్లిస్ ఎమ్మెల్సీ రజ్వి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, టిఆర్‌ఎస్‌లో చేరిన గంగాధర్ పదవీ కాలం ముగియనున్నది. ఇప్పుడు అసెంబ్లీలో వివిధ పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య బలబలాల ప్రకారం మూడు స్థానాలను టిఆర్‌ఎస్ సునాయసంగా చేజిక్కించుకోగలదు. కానీ మిత్ర ధర్మం ప్రకారం ఒక (రజ్వీ) స్థానాన్ని మజ్లిస్‌కు కేటాయించాలని టిఆర్‌ఎస్ భావిస్తోంది.