తెలంగాణ

హైదరాబాద్‌కు మరో విశ్వవిద్యాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 28: హైదరాబాద్‌కు మరో విశ్వవిద్యాలయం రానుంది. కెఎల్ యూనివర్శిటీ తన క్యాంపస్‌ను ఈ విద్యాసంవత్సరం నుండి హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్నట్టు సంస్థ ఉపాధ్యక్షుడు హవీష్ లక్ష్మణ కోనేరు చెప్పారు. హైదరాబాద్ బాచుపల్లి వద్ద 90 ఎకరాల విస్తీర్ణంలో 15వందల కోట్లతో క్యాంపస్ నిర్మిస్తున్నామని వచ్చే ఏడాది జూన్ నాటికి అది సిద్ధం అవుతుందని, అంత వరకూ అప్పా జంక్షన్ వద్ద ఉన్న ప్రాంగణంలో ఈ విద్యాసంవత్సరం నుండే అడ్మిషన్లు మొదలుపెడతామని అన్నారు. పార్క్‌హయత్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఉన్నత విద్యావిధానంలో ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రమాణాలు, విద్యావ్యవస్థలో చేయాల్సిన మార్పులతో పాటు కెఎల్ యూనివర్శిటీ అనుసరిస్తున్న విద్యావిధానం ప్రమాణాలను ఆయన వివరించారు. పాఠ్యపుస్తకాలను బట్టీపట్టించే విధానం కన్నా పరిశోధనాత్మక, ప్రయోగాత్మక విశే్లషణతో కూడిన విద్య అవసరమని అన్నారు. అలాగే విద్యార్థులు అన్ని రంగాల్లో వికాసం చెందేలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. కంపెనీలకు అవసరమైన కౌశలాలతో విద్యార్థులు రావడం లేదని, ఆ లోపాలను సరిదిద్దినట్టయితే అవకాశాలకు ఢోకా లేదని చెప్పారు. వర్శిటీల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి ఆధునికతను సంతరించుకోవాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో వర్శిటీని నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. తాము కూడా అంతర్జాతీయ విద్యార్ధులు తమంతట తామే వచ్చి చేరేలా వర్శిటీని నిర్వహించబోతున్నట్టు పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా మే 12,13 తేదీల్లో ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నామని అందులో ఉత్తీర్ణులైన వారికి సీట్లు కేటాయిస్తామని చెప్పారు.

చిత్రం..హైదరాబాద్‌లో మంగళవారం విలేఖరుల సమావేశంలో
మాట్లాడుతున్న కెఎల్ వర్శిటీ ఉపాధ్యక్షుడు హవీష్ లక్ష్మణ కోనేరు