తెలంగాణ

మరణంలోను తోడుగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరిడేపల్లి, పిబ్రవరి 28 : మంగళవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. మృతులిద్దరూ నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలంలోని కోదండరామపురం గ్రామానికి చెందినవారు కావడంతో స్థానికంగా విషాదం చోటుచేసుకుంది. జరిగిన సంఘటన ఆ కుటుంబంలో తీరని వేదన మిగిల్చింది. కుటుంబమే కాకుండా గ్రామమంతా కన్నీటి పర్యంతమయ్యారు. కోదండరామపురం గ్రామానికి చెందిన నలబోలు కృష్ణారెడ్డి (32), నలబోలు శేఖర్‌రెడ్డి (28) అనే ఇద్దరు అన్నదమ్ములు నందిగామ బస్సు ప్రమాదంలో మృతి చెందారు. మృతుల్లో ఒకడైన కృష్ణారెడ్డి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, శేఖర్‌రెడ్డి ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో సిఆర్‌పిఎఫ్ క్యాంప్‌లో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. కృష్ణారెడ్డి పెండ్లికోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా రెండు మూడు సంబంధాలున్నాయి. పెళ్లి చూపులు చూసుకునేందుకు రావాలంటూ తల్లిదండ్రుల నుంచి కబురురావడంతో బెంగుళూరు నుంచి కృష్ణారెడ్డి తన సోదరుడు ఉంటున్న భువనేశ్వర్ వెళ్లాడు. సెలవులు పెట్టి సోదరునితో కలిసి గ్రామంలో కుటుంబంతో గడిపేందుకు వారిద్దరూ బయలుదేరారు. భువనేశ్వర్‌లో సోమవారం 11 గంటలకు హైదరాబాద్ వెళ్లే ప్రైవేటు బస్సు ఎక్కారు. మరో 15 నిమిషాల్లో కోదాడలో దిగాల్సివుండగా నందిగామ వద్ద జరిగిన ప్రమాదం వారిని అనంతలోకాలకు తీసుకెళ్లింది. ఇద్దరు కుమారులు చనిపోయిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపించారు. చనిపోయిన కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డిల తల్లిదండ్రులు కమలమ్మ, శేషిరెడ్డి వ్యవసాయదారులు. వ్యవసాయ కుటుంబమైనప్పటికీ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. ఇద్దరు పిల్లలు ప్రయోజకులై చేతికందిన సమయంలో బస్సు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడం విచారకరమని స్థానికులు వాపోయారు.

చిత్రం.. ప్రమాదంలో చనిపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, డాక్టర్ శేఖర్‌రెడ్డి