తెలంగాణ

జాబ్‌మేళా నిర్వాహకుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ / ఉప్పల్, ఫిబ్రవరి 28: జాబ్ మేళా పేరుతో నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టిన అద్వితీయ సేవా ఫౌండేషన్ నిర్వాహకులను ఉప్పల్ పోలీసులు అరెస్టుచేసి మంగళవారం కోర్టుకు రిమాండ్ చేశారు. మల్కాజిగిరి ఏసిపి గోనె సందీప్ ఉప్పల్ ఎస్‌ఐ రవికుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అరెస్టు వివరాలు తెలిపారు. ‘మేడ్చల్ జిల్లా నాచారం మల్లాపూర్‌లోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న మునిగేటి నెమిలికుమార్ అలియాస్ సామ్యేల్ కుమార్ (25) ఓ నిరుద్యోగి. టెలీకాలర్ ద్వారా ఉద్యోగం చేసిన అనుభవంతో అద్వితీయ సేవా ఫౌండేషన్ ఉపాధ్యక్షుడిగా పదవి చేపట్టిన అతడు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును సంపాదించాలనే ఉద్దేశంతో ఉద్యోగ మేళాను నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలకు ఇ-మెయిల్ ద్వారా సమాచారం అందించి జాబ్‌మేళాలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.
ఇందుకు వేదికగా ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ కళాశాల యాజమాన్యం నుంచి అనుమతి తీసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని, 25కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్న అతి పెద్దజాబ్ మేళా ద్వారా వేలాదిగా ఉద్యోగాలు వస్తాయని 15 రోజులుగా వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా ప్రచారం నిర్వహించాడు. ఈ మేరకు ఈ నెల 26న నిర్వహించిన జాబ్ మేళాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కర్నాటక ప్రాంతాల నుంచి సుమారు 14వేల మంది నిరుద్యోగులు తరలివచ్చారు. అప్పటికే పేటిఎం ద్వారా ఒక్కొక్కరు రూ.200 చెల్లించిన నిరుద్యోగులు, జాబ్ మేళా కార్యక్రమంలో గెట్‌మై జాబ్ పేరుతో ఎంట్రీ రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.200 తీసుకున్నారు. తుది నిమిషంలో కేవలం పది, ఇంటర్ చదివిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయని, బిటెక్, ఎంబిఎ చదివిన వారికి లేవని పంపించడంతో నిరుద్యోగుల్లో మొదలైన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. అమాయకులైన నిరుద్యోగుల ఉద్యోగాల ఎర చూపి డబ్బులు దండుకున్న నిర్వాహకుడు నెమలి కుమార్‌తో పాటు అద్వితీయ సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు వౌలాలి హౌజింగ్‌బోర్డులోని వైభవ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న లింగాల సుమిత్‌ను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు ఏసిపి తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 144 సెక్షన్ అమలులో ఉండగా బోగస్ జాబ్ మేళాకు అనుమతి ఇచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నిబంధనలు ఉల్లంఘించిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నిర్వాహకుడు పేటిఎం ద్వారా లక్షా పదకొండువేల ఆరువందల రూపాయలను తీసుకున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. గెట్‌మై జాబ్ వెబ్‌సైట్ ద్వారా వసూలు చేసిన బ్యాంక్ అకౌంట్‌పై విచారణ చేపట్టినట్లు వివరించారు.

చిత్రం..అద్వితీయ సేవా ఫౌండేషన్ నిర్వాహకుల
అరెస్టు వివరాలను వెల్లడిస్తున్న మల్కాజిగిరి ఏసిపి సందీప్