తెలంగాణ

కూచిభొట్లకు అంతిమ వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ జీడిమెట్ల, ఫిబ్రవరి 28: అమెరికాలోని కాన్సాస్‌లో జాత్యహంకారి కాల్పులకు బలైన కూచిభొట్ల శ్రీనివాస్‌కు మంగళవారం ఘనంగా అంత్యక్రియలు జరిగాయి. తండ్రి మధుసూదన్‌రావు తన కుమారుడికి అశృనయనాలతో అంతిమ సంస్కారం నిర్వహించారు. అంతకు ముందు సోమవారం అర్ధరాత్రి నగర శివార్లలోని స్వగృహానికి చేరిన శ్రీనివాస్ పార్థివ దేహానికి మంగళవారం నాడు శ్రీనివాస్ భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు, బంధువులు, స్నేహితులు తరలి వచ్చారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి నేతలు మురళీధర్‌రావు, కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు శ్రీనివాస్‌కు నివాళి అర్పించారు. ఇంట్లో సంప్రదాయబద్ధంగా ఉత్తర క్రియలు నిర్వహించిన అనంతరం ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక వాహనంలో నగరంలోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి తరలించి అంతిమ సంస్కారాన్ని నిర్వహించారు. అంతిమయాత్రలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు.
కన్నీళ్లే మిగిలాయి
అమెరికా దేశానికి వెళ్లి ఎంతో ఉన్నతంగా జీవిస్తారని ఆశించిన తల్లిదండ్రులకు శ్రీనివాస్ మృతి కన్నీళ్లే మిగిల్చాయి. అమెరికాకు వెళ్లిన కూచిభొట్ల శ్రీనివాస్ తిరిగి స్వదేశానికి మృతదేహంగా మారి రావడాన్ని చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా తల్లడిల్లిపోయారు. శ్రీనివాస్ పార్థివ దేహంపై పడి రోదించడం ప్రతిఒక్కరినీ కలచి వేసింది. శ్రీనివాస్ భార్య సునయన భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది.
సోదరులు శ్రీనివాస్ పార్థివ దేహాన్ని చూసి శోకసంద్రంలో మునిగిపోయారు. శ్రీనివాస్ మృతిపై ప్రముఖులు పలుకరించిన ప్రతిసారి తల్లిదండ్రులు, భార్య సునయనలో మాటలు సైతం రాలేనంతగా రోదించడం అందరినీ కలచివేసింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు శ్రీనివాస్ పార్థివ దేహం ఇంట్లో నుండి వాహనంలోకి ఎక్కించే సమయంలో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కుమారుడు శ్రీనివాస్ ఇక రాలేడని తల్లిదండ్రులు మధుసూదన్‌రావు, వర్థినిలు దుఃఖసాగరంలో మునిగిపోయారు.
చిన్నకొడుకును అమెరికా పంపించం: తల్లిదండ్రులు
ఇకపై అమెరికాకు ఎవరూ వెళ్లవద్దని, నా చిన్నకుమారుడిని అమెరికా పంపించనంటూ శ్రీనివాస్ తల్లి వర్ధిని బోరున విలపించారు. గద్గదస్వరంతో విలపించిన ఆమెను ఆపడం ఎవరి తరం కాలేదు. నా చిన్న కుమారుడిని అమెరికా వెళ్లనివ్వను..సాయి కిరణ్ కుటుంబాన్ని హైదరాబాద్‌కు వచ్చేయమని చెప్తానన్నారు. తన పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారని సంతోషించానని..కానీ ఇంతలో ఘోరం జరిగిందన్నారు. ఇప్పటికైనా అమెరికాలో ఉండే భారతీయులకు రక్షణ కల్పించాలని శ్రీనివాస్ సోదరుడు సాయికిరణ్ కోరారు. సాయికిరణ్ విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

చిత్రం..మంగళవారం కూచిభొట్లకు నివాళులర్పించి
శ్రీనివాస్ తల్లిని ఓదార్చుతున్న కేంద్రమంత్రి దత్తాత్రేయ