తెలంగాణ

సింగరేణి ఘనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 28: బంగారు తెలంగాణ నిర్మాణానికి సింగరేణి సంస్థ తన వంతుగా తగినంత బొగ్గు ఖనిజాన్ని అందించడంతో పాటు విద్యుత్తును కూడా అందిస్తున్నందుకు సంతోషిస్తున్నామని సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీ్ధర్ తెలిపారు. విద్యుత్తు వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం తన సామర్థ్యంతో విద్యుత్తును ఉత్పత్తి చేసి అందిస్తున్నదని, ఇదే విధంగా భవిష్యత్తులోనూ అందిస్తామని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూనిట్-1లో ఇప్పటి వరకు 2,157 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి కాగా, దీనిలో 2000 మిలియన్ యూనిట్లు గ్రిడ్‌కు అనుసంధానం చేశామని చెప్పారు.
అదేవిధంగా యూనిట్ రెండులో 1286 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి కాగా, 1191 మిలియన్ యూనిట్లు గ్రిడ్‌కు సరఫరా పేర్కొన్నారు. మొత్తం మీద ఉత్పత్తి అయిన 3,443 మిలియన్ యూనిట్లలో 3,191 మిలియన్ యూనిట్లు రాష్ట్ర అవసరాలకు అందించగలిగామని ఆయన తెలిపారు. ఒక్క ఫిబ్రవరి నెలలోనే యూనిట్-1 నుంచి 348 మిలియన్ యూనిట్లు, యూనిట్-2 నుంచి 389 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అయ్యిందని ఆయన వివరించారు. దీనిలో యూనిట్-1 నుంచి 324 మిలియన్ యూనిట్లు, యూనిట్-2 నుంచి 364 మిలియన్ యూనిట్లు కలిపి మొత్తం 688 మిలియన్ యూనిట్లు గజ్వేల్ పవర్ గ్రిడ్‌కు అందించామన్నారు. నూరు శాతం పిఎల్‌ఎప్‌తో సింగరేణి థర్మల్ విద్యుత్తు యూనిట్-2 రికార్డు స్థాయిలో 95 శాతం సాధించిందని సిఎండి శ్రీ్ధర్ వివరించారు.