తెలంగాణ

ప్రాజెక్టుల అనుమతుల కోసం ఢిల్లీ వెళ్లిన ఉన్నతాధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 28: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో పవర్ ఆఫ్ ప్రెజేంటేషన్‌ను మార్చి 20వ తేదీ ఇవ్వాలని కేంద్రం రాష్ట్ర సాగునీటి శాఖను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు ఇంకా మంజూరు కాలేదు. ఈ అనుమతులు వచ్చిన తర్వాతనే ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి. ముందుగా కేంద్ర జల సంఘం అనుమతి తీసుకోవాలని పర్యావరణ శాఖ రాష్ట్రాన్ని ఆదేశించిన విషయం విదితమే. ఈ శాఖ సూచించినట్లుగా రాష్ట్రానికి చెందిన సాగునీటి నిపుణులు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రికార్డులతో ఢిల్లీకి సోమవారం వెళ్లారు. వీరు పర్యావరణ మంత్రిత్వ శాఖను కలిసి వారు ప్రస్తావించిన సందేహాలను నివృత్తి చేశారు. మార్చి 20వ తేదీన పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయాలని కేంద్ర జల సంఘం కోరినట్లు సాగునీటి ఇంజనీర్లు తెలిపారు. ముందుగా కేంద్ర జలసంఘం అనుమతి లభించిన తర్వాతనే అనుమతి ఇవ్వాలని ఇటీవలనే కేంద్ర పర్యావరణ శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయం దేశంలోని అన్ని ప్రాజెక్టులకు వర్తిస్తుంది. కాగా పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల స్కీంకు సంబంధించి ఒక పిటిషన్‌ను చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తును కూడా తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ప్రాణహిత, కంతనపల్లి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇచ్చే విషయమూ కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ప్రాణహిత ప్రాజెక్టుకు 2671.32 ఎకరాల అటవీ భూమి, కంతనపల్లి ప్రాజెక్టుకు 90 ఎకరాల అటవీ భూమి అవసరమని ప్రభుత్వం గుర్తించింది. వీటికి కూడా పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది.