తెలంగాణ

రోడ్డునపడ్డ విద్యార్థుల జీవితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 28: బోగస్ విద్యాసంస్థలు, అనుమతి లేని కళాశాలలతో మోసపోతున్న విద్యార్థులకు దేవుడే దిక్కయ్యాడు. ఏడాది పాటు మంచిగా చదువుకుని తీరా పరీక్ష రాసే సమయంలో చివరి క్షణం వరకు హాల్‌టికెట్లు లభించకపోవడంతో విద్యార్థులు చెందుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. పిల్లల భవిష్యత్ కోసం మంచి చదువులు చదివించేందుకు తల్లిదండ్రులు పడే శ్రమను దోచుకునే యాజమాన్యాలపై ప్రభుత్వాలు స్పందించి కఠిన చర్యలు తీసుకునేంతవరకు ఈ దగా కోరు మోసాలు ఆగే పరిస్థితి కనబడటంలేదు. కేవలం కళాశాల పేరు మార్చుకోవడంతో పాటు విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అవలంభించాల్సిన వైఖరిని సైతం సదరు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి పరీక్షా ఫీజులు వసూలు చేసి సకాలంలో ప్రభుత్వాన్ని చెల్లించకపోవడమే విద్యార్థుల జీవితాలు రోడ్డున పడటానికి కారణమవుతున్నాయి. యాజమాన్యాల నిర్లక్ష్యం ప్రభుత్వ అధికారుల అజమాయిషీ లేకపోవడం అవినీతి కంపుతో కొనసాగుతున్న విద్యాశాఖలో అక్కడక్కడా ప్రతి ఏడాది సంఘటనలు చోటు చేసుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటంటూ విద్యార్థుల తల్లిదండ్రులు గోడుమంటున్నారు. పీజులు చెల్లించినాటి నుంచి ప్రాక్టికల్ పరీక్షలు పూర్తయ్యేంతవరకు కూడా హాల్ టిక్కెట్ రాకపోవడంపై నిలదీసిన విద్యార్థులు, తల్లిదండ్రులను మభ్యపెడుతూ మరసటి రోజు పరీక్ష ఉందనగా కూడా మాయమాటలతో కాలాన్ని వెలిబుచ్చిన వనస్థలిపురంలోని వాసవీ జూనియర్ కళాశాల యాజమాన్యంపై విద్యార్థులు, వారి తల్లితండ్రులు తిరగబడ్డారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలవుతున్నా మంగళవారం ఉదయం కూడా కళాశాల యాజమాన్యం మభ్యపెట్టే ప్రయత్నం చేయడంతో ఆందోళనకు దిగారు.
వివరాల్లోకి వెళితే.. శ్రీ మేధావి కళాశాలను శ్రీనివాస్ అనే వ్యక్తి గత సంవత్సరం కొనుగోలు చేశారు. అదే పేరుతో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన 104 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ అయ్యారు. తరగతులు మొదలైనా మూడు నెలల తర్వాత కళాశాల పేరు మారుతుందని వాసవీ జూనియర్ కళాశాలగా కొనసాగిస్తామంటూ యాజమాన్యం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వివరించి కళాశాలను యదావిదిగా కొనసాగించారు. ఈ విద్యాసంవత్సరం యదావిదిగా మొదటి సంవత్సరంలో 144 మంది విద్యార్థులు చేరగా వారికి వాసవి జూనియర్ కళాశాల పేరుతో అడ్మిషన్ ఇచ్చారు. ఇంటర్మీడియెట్ పరీక్షలకు ఫీజులు చెల్లించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు విద్యార్థినీ, విద్యార్థులు 248 మంది గడువులోగా ఇంటర్ మొదటి, రెండో సంవత్సరానికి సంబంధించి ఫీజులు చెల్లించారు. పాత కళాశాలను కొనుగోలు చేసిన యాజమాన్యం సకాలంలో పేరు మార్చుకోకపోవడంతో పాటు వాసవీ కళాశాలకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. సకాలంలో విద్యార్థుల నుంచి తీసుకున్నా పరీక్ష ఫీజులను కూడా ప్రభుత్వానికి చెల్లించలేదు. దీంతో ఈ కళాశాలలో చదివిన 248 మంది విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు రాకపోవడంతో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవ్సరం చదువుతున్న 104 మందిలో ప్రాక్టికల్ నిర్వహణకు కూడా అనుమతి లభించలేదు. అయినా యాజమాన్యం విద్యార్థులను మభ్యపెడుతూ చివరి రోజు వరకు కాలయాపన చేయడంతో చివరకు ఆన్‌లైన్‌లో హాల్‌టిక్కెట్లు తీసుకునే ప్రయత్నం చేసిన విద్యార్థులకు సదరు కళాశాల పేరు కదా వారి పేర్లు కూడా ఎక్కడా కన్పించకపోవడంతో అవాక్కైన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మంగళవారం కళాశాల యాజమాన్యాన్ని నిలదీసేందుకు అక్కడికి వచ్చారు. విషయం తెలుసుకున్న తర్వాత ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యను ఆశ్రయించడంతో విద్యాశాఖ అధికారులతో నేరుగా మాట్లాడిన ఆయనకు ప్రస్తుతం ఈ పరీక్షల్లో పాల్గొనే అవకాశం లేదని సమాధానం రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భావోధ్వేగానికి గురయ్యారు. చివరకు విద్యాసంవత్సరం నష్టపోకుండా మధ్యలో వీరికి పరీక్ష రాసుకునే అవకాశం కల్పించి న్యాయం చేస్తామని ఎమ్మెల్యేకు విద్యాశాఖ అధికారులు ఇచ్చిన హామీ ఎంత మేరకు నెరవేరుతుందోననే అనుమానంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం వనస్థలిపురంలో ఒక కార్యక్రమానికి వచ్చిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని ఘెరావ్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సమస్య తన శాఖకు సంబంధించింది కాదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దృష్టి దృష్టికి తీసుకు వెళ్లండంటూ ఆయన సమాధానం చెప్పి వెళ్లిపోయారు.
కాలేజీపై క్రిమినల్ కేసు
కాలేజీపై క్రిమినల్ కేసును నమోదు చేసినట్టు బోర్డు కార్యదర్శి అశోక్ చెప్పారు. యాజమాన్యం పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేసి బోర్డకు చెల్లించలేదని తమ దర్యాప్తులో తేలిందన్నారు. విద్యార్థులు నష్టపో కుండా మే నెలలో నిర్వహించే పరీక్షలకు హాజరైతే తాము వాళ్లని రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగ ణిస్తామన్నారు.